Infosys: కోవిడ్ తర్వాత ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం.. ఇక వాళ్లకు షాక్

వాస్తవానికి కోవిడ్ మహమ్మారి ఐటి, కార్పొరేట్ ఉద్యోగుల పని విధానాన్ని పూర్తిగా మార్చేసింది. వ్యాయాలు మూతపడటంతో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా అమలు చేస్తూనే ఉన్నాయి.

Written By: Bhaskar, Updated On : June 17, 2023 12:56 pm

Infosys

Follow us on

Infosys: అనుకున్నదే అవుతోంది. ఐటీ ఉద్యోగులు భయపడుతున్నదే జరుగుతున్నది.. నిన్నటిదాకా ఇంటి వద్ద నుంచి పనిచేసిన ఐటీ ఉద్యోగులు ఇప్పుడిక కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఈ విధానానికి ఎవరు శ్రీకారం చుడతారు అనే సందేహం మొన్నటిదాకా ఉండేది. అందరి వేళ్ళు కూడా టిసిఎస్ సంస్థ పైన చూపించేవి. అది ఎంతకూ నిర్ణయం తీసుకోకపోవడంతో నేరుగా ఇన్ఫోసిస్ రంగంలోకి దిగింది. ఉద్యోగులను ఆఫీస్ రావాలని వర్తమానాలు పంపింది. రాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది.

వాస్తవానికి కోవిడ్ మహమ్మారి ఐటి, కార్పొరేట్ ఉద్యోగుల పని విధానాన్ని పూర్తిగా మార్చేసింది. వ్యాయాలు మూతపడటంతో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా అమలు చేస్తూనే ఉన్నాయి. ఈ లోగానే ఆర్థిక మాంద్యం ఛాయలు వెలుగు చూడటం, వెస్ట్రన్ కంట్రీస్ లో పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో ఐటి కంపెనీలు కూడా పునరాలోచనలో పడ్డాయి. కోవిడ్ కి ముందు అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు.. ఆ తర్వాత ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఖర్చుపొదుపులో భాగంగా చాలావరకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇప్పుడు ఇక వర్క్ ఫ్రం హోం విధానానికి కంపెనీలు టాటా చెబుతున్నాయి. కొన్ని మధ్యతరహా కంపెనీలు ఇప్పటికే ఆ విధానానికి స్వస్తిపరికాయి. మరి కొన్ని కంపెనీలు మాత్రం కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోం, కొన్ని రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్ అనే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే కొంతమంది కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రం మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంటి వద్ద నుంచి మాత్రమే పనిచేస్తున్నారు.

ఇక ముందుగానే చెప్పినట్టు ఇన్ఫోసిస్ ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అమెరికా, కెనడా దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది..ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం మోడ్ లో పనిచేయాలి అనుకుంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి కార్యాలయానికి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించేది. ఇన్ఫోసిస్ కంపెనీకి అమెరికా, కెనడా దేశాలలో 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.అయితే భారతదేశంలో మాత్రం ఉద్యోగులు కార్యాలయానికి రావడం ప్రస్తుతానికయితే తప్పనిసరి చేయలేదు. ఇక్కడ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఇన్ఫోసిస్ నవంబర్ నెలలో మూడు దశల్లో రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్ ప్రకటించింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడా దేశాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ మోడ్ తప్పనిసరి చేసిన ఇన్ఫోసిస్ త్వరలో భారత దేశంలో కూడా అమలుచేస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక వర్క్ ఫ్రం హోం కు అలవాటు పడిన ఉద్యోగులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి చాలామంది మహిళా ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో టాటా కంపెనీ తన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. మరి ఈ ఉదంతం నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.