Homeబిజినెస్Infinix : తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లతో దుమ్ములేపనున్న ఇన్ఫినిక్స్ నయా ఫోన్!

Infinix : తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లతో దుమ్ములేపనున్న ఇన్ఫినిక్స్ నయా ఫోన్!

Infinix : మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే ఫీచర్లతో రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5500mAh భారీ బ్యాటరీ ఉన్నాయి. 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తున్న భారతదేశపు అత్యంత స్లీక్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ధర ఎంత, అమ్మకాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి. మరి ఈ హ్యాండ్ సెట్లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

Also Read : భారీ బ్యాటరీ.. అద్భుతమైన ఫీచర్స్.. అందుబాటులోకి కొత్త ఫోన్..

ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. గేమింగ్ సమయంలో ఇది 90fps ఫ్రేమ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

ప్రాసెసర్: ఈ 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు.

కెమెరా సెటప్: ఫోన్ వెనుకవైపు 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది, ఇది 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందించారు. ఈ ఫోన్ డ్యూయల్ వీడియో క్యాప్చర్, AI కెమెరా ఫీచర్లతో వస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం: 5500mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ 3.0కి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌ను 0 నుండి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 60 నిమిషాలు పడుతుందని కంపెనీ పేర్కొంది.

స్పెషల్ ఫీచర్స్ : IP64 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ స్ట్రాంగ్ నెస్ కలిగి ఉంది. సేఫ్లీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.

ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ ధర:
ఈ తాజా ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో రిలీజ్ చేశారు. 8GB RAM/128GB వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు. అలాగే, మీరు ఈ ఫోన్ 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ.17,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ తదుపరి వారం ఏప్రిల్ 24 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు ఆఫర్‌లతో ఈ ఫోన్‌లను రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు.

పోటీ
ధర పరంగా చూస్తే ఇన్ఫినిక్స్ ఈ తాజా ఫోన్ రూ.17,999 ధర కలిగిన నథింగ్ ఫోన్ (2a) 5G, రూ.16,999 ధర కలిగిన మోటరోలా G85 5G, రూ.17,499 ధర కలిగిన వివో T3 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version