Income Tax: ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే నేటి కాలంలో బ్యాంకు ద్వారానే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తుంటాం. కానీ ఒక్కోసారి బిగ్ అమౌంట్ ను బ్యాంకు ట్రాన్స్ ఫర్ చేస్తే అదనంగా ఛార్జీలు పడే అవకాశం ఉంది. అందువల్ల కొంత మంది బ్యాంకు నుండి డబ్బును విత్ డ్రా చేసుకొని క్యాష్ రూపంలో ఇచ్చి వస్తువును కొనుగోలు చేస్తారు. అయితే ఏ సంస్థ అయినా ఇప్పుడు రూ.2 లక్షల కంటే ఎక్కువగా క్యాష్ రూపంలో తీసుకోదు. 1,99,000 లను మాత్రమే తీసుకొని మిగతాది బ్యాంకు ద్వారా ట్రాన్స్ ఫర్ చేయమని చెబుతుంది. ఎందుకంటే?
ఒక కారు కొనాలంటే మినిమం రూ. 4 లక్షలకు పైగానే ఉంటుంది. ఆన్ రోడ్ లో దీని మొత్తం ఎక్కువగానే ఉంటుంది. కారును కొందరు ఫైనాన్స్ ద్వారా ఈఎంఐ చెల్లించేలా కొనుగోలు చేస్తారు. మరికొందరు క్యాష్ ఉంటే ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇతర వ్యక్తులు, బ్యాంకులో ఉన్న నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకొని వస్తారు. అయితే నేటి కాలంలో మనీ ట్రాన్స్ ఫర్ డిజిట్ అయినందున ఇంకొందరు ఆన్ లైన్ లో చెల్లించాలని చూస్తున్నా.. ఇన్ కం ట్యాక్స్ పడుతుందేమోనని అనుకుంటారు.
కానీ బ్యాంకు ద్వారా కాకుండా క్యాష్ రూపంలో మినిమం కంటే ఎక్కువ చెల్లిస్తే ఇన్ కం ట్యాంక్స్ ఫెనాల్టీ అధికంగా వేస్తారు. ఏ వస్తువు కొనుగోలు చేసినా .. అది రూ.2 లక్షల లోపు ఉంటే దానికి క్యాష్ రూపంలో రూ.1,99,999 చెల్లించి వచ్చు. లేదా రూ.2 లక్షల కంటే ఎక్కువ ప్రైస్ ఉంటే రూ.1,99,999 చెల్లించి మిగతా ఎంత మొత్తం అయినా బ్యాంకు నుంచి ట్రాన్స్ ఫర్ చేయాలి. అలా కాకుండా రూ. 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో ఇస్తే 100 శాతం ఫెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.
సెక్షన్ 269 సెట్ ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఒక వ్యక్తి క్యాష్ రూపంలో రూ. 2 లక్షలలోపు మాత్రమే ఇతర షోరూం లేదా సంస్థకు క్యాష్ రూపంలో చెల్లించాలి. అలా రూల్స్ అతిక్రమిస్తే 100 శాతం ఫెనాల్టీ భరించాల్సి వస్తుంది. ఉదాహరణకు పైన చెప్పిన విధంగా కారు ను కొనుగోలు చేయాలనుకుంటే రూ. 1,99,999 కంటే రూ. 2,00.001 ని కూడా క్యాష్ రూపంలో చెల్లిస్తే అంతే మొత్తంలో అంటే 2,00.001ని ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఈ విషయంపై షోరూం లేదా సంస్థ నిర్వాహకులతో ముందు చర్చించిన తరువాత మనీని చెల్లించాలి.