https://oktelugu.com/

Automobiles : కొత్త ఏడాదిలో రిలీజై.. ఆకట్టుకుంటున్న డీజిల్ SUVలు.. వీటి ఇంజిన్ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

SUV కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ Cretaను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇది అప్డేట్ వెర్షన్ ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చింది. ప్రారంభం నుంచి దీని అమ్మకాలు ఊపందుకున్నాయి. క్రెటా అప్డేట్ వెర్షన్ డీజిల్ ఇంజిన్ 1.5 లీటర్ 4 సిలిండర్ ను కలిగి ఉంది. ఇందులో 113 బీహెచ్ పీ పవర్ తో పాటు 250 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 12:54 PM IST
    Follow us on

    Automobiles :  ఆటోమోబైల్ మార్కెట్లోకి SUVలకు మంచి ఆదరణ ఉంది. విశాలమైన స్సేస్ తో పాటు బాహుబలి లాంటి ఇంజిన్ వ్యవస్థను కలిగి ఉన్న ఎస్ యూవీ కార్ల అంటే కొందరు ఎగబడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు సైతం ఎక్కువగా ఎస్ యూవీ వేరియంట్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. సాధారణంగా ఎస్ యూవీలు డీజిల్ వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుంటాయి. ఇవి వ్యక్తిగతంగా ఉపయోగించడంతో పాటు ట్రావెల్ కోసం కొనుగోలు చేస్తారు. అందువల్ల డీజిల్ ఇంజిన్ నే ఎక్కువగా కలిగి ఉంటాయి. అయితే కొంత కాలంగా డీజిల్ వాహనాలు మార్కెట్లోకి రావడం తగ్గించాయి. త్వరలో డీజిల్ రహిత వాహనాలు ఉండే అవకాశం ఉంటుందని ఇదివరకే చర్చ సాగింది. అయినా ఎస్ యూవీ డీజిల్ వాహనాలు కొన్ని మార్కెట్లోకి వచ్చాయి. 2024లో ఇవి బెస్ట్ వెహికల్స్ గా నిలుస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
    SUV కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ Cretaను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇది అప్డేట్ వెర్షన్ ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చింది. ప్రారంభం నుంచి దీని అమ్మకాలు ఊపందుకున్నాయి. క్రెటా అప్డేట్ వెర్షన్ డీజిల్ ఇంజిన్ 1.5 లీటర్ 4 సిలిండర్ ను కలిగి ఉంది. ఇందులో 113 బీహెచ్ పీ పవర్ తో పాటు 250 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. ఇది లెవల్ 2 ఆడాస్ సెక్యూరిటీ ఫీచర్ ను అమర్చారు. అలాగే 360 డిగ్రీ కెమెరా, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
    ఫోర్స్ కంపెనీ నుంచి డీజిల్ ఎస్ యూవీ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంటోంది. ఈ కంపెనీకి చెందిన గుర్ఖా 5 డోర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది క్రెటాను పోలిన ఇంజిన్ ను కలిగి ఉంది. మిడ్ లైఫ్ ఫేస్ లిప్ట్ లో మాత్రం కొన్ని మార్పులు చేశారు. ఇలా మార్చిన ఫోర్స్ గుర్ఖా ఇంజిన్ 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 138 బీహెచ్ పీ పవర్ తో పాటు 320 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ జత చేయబడింది. వీటితో పాటు ఇంటీరియర్ డిజైన్ లో మార్పులు చేశారు. సెక్యూరిటీ  పరంగా  క్రెటాను పోలీ ఉంటాయి.
    దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా భారత మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ కంపెనీకి చెందిన సోనెట్ డీజిల్ ఎస్ యూవీగా మార్కెట్లోకి వచ్చింది. ఇది పెట్రోల్ లో పాటు డీజిల్ రెండు ఇంజిన్లను చూడొచ్చు. వీటితో పాటు 113 బీహెచ్ పీ పవర్ తో పాటు 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగిన సోనెట్ ఫేస్ లిప్ట్ ను ఈ ఏడాదిలోనే ప్రారంభించారు.
    ఎస్ యూవీ కార్ల ఉత్పత్తికి పెట్టింది పేరు మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ కంపెనీ నుంచి బొలెరో నియో ప్లస్ ను ఈ ఏడాదిలో ప్రారంభించారు. ఈ మోడల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు మాన్యువల్ గేర్ బాక్స్ ను కూడా సెట్ చేశారు. 118 బీహెచ్ పీ పవర్ తో పాటు 280 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి అయ్యే ఈ మోడల్ లో బడ్జెట్ లో అందుబాటులో ఉంది.