SBI :దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వేర్వేరు సేవలను ఆన్ లైన్ లోనే పొందే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. ఈ బ్యాంక్ ద్వారా సులువుగా వేర్వేరు సేవలను పొందవచ్చు. ఎస్బీఐ వేగంగా రుణాలను అందించడంతో పాటు ఆన్ లైన్ లోనే వ్యక్తిగత రుణాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే ఎస్బీఐ ఖాతాదారులు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ను పొందవచ్చు. ఎస్బీఐ పర్సనల్ లోన్ ను పొందాలంటే 9.6 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజులో కూడా ఎస్బీఐ ఆఫర్ ను కల్పిస్తుండటం గమనార్హం. 2022 సంవత్సరం జనవరి నెల 31వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజులలో మినహాయింపును కల్పిస్తోంది. ఆన్ లైన్ లో ఎస్బీఐలో పర్సనల్ లోన్ కావాలంటే ఎస్బీఐ యోనో యాప్ ను మొదట డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆ తర్వాత అవైల్ నౌ అనే బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రుణం మొత్తం, కాలవ్యవధిని ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను అందులో ఎంటర్ చేయాలి. ఈ విధంగా కేవలం నాలుగు క్లిక్స్ తో ఎస్బీఐలో పర్సనల్ లోన్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులకు ఈ లోన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
పూర్తి వివరాలకు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించవచ్చు. ఈ విధంగా సులభంగా రుణం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.