PPF Scheme: ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీతో పాటు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ ఉండగా ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
15 సంవత్సరాల పాటు ఈ విధంగా 22.50 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 18.18 లక్షల రూపాయలు వడ్డీగా లభిస్తుంది. మొత్తం 40.68 లక్షల రూపాయలు ఈ విధంగా పొందవచ్చు. 15 సంవత్సరాల తర్వాత పీపీఎఫ్ స్కీమ్ లో పదేళ్ల పాటు సంవత్సరానికి లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పెట్టుబడి 37.50 లక్షల రూపాయలు అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత 65.58 లక్షల రూపాయలు వడ్డీగా లబిస్తాయి.
మన దేశంలో నివశించే వాళ్లు ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. స్వయం ఉపాధి పొందేవాళ్లు, పెన్షనర్లకు ఈ స్కీమ్ ప్రయొజనకరంగా ఉంటుంది. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఫారమ్ ఇ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సహాయంతో ఈ స్కీమ్ లో చేరవచ్చు