MG Motors EV Car : భారత్ లో కార్ల కొనుగోలు విషయంలో వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే ఎక్కువగా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని కంపెనీలు సైతం ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి ఉత్సాహం చూపుతున్నాయి. అయితే ఈవీలు అనగానే కొంత మంది ధరల విషయంలో ఆలోచిస్తారు. కానీ కొన్ని కొంపెనీలు మాత్రం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేలా ధరలు నిర్ణయించి మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ఎంజీ మోటార్స్ సరికొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్స్, ధరను చూసి వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఎంజీ మోటార్స్ నుంచి రిలీజ్ అయిన ఆ కారు ఏది? దాని వివరాల్లోకి వెళ్తే..
MG Motors నుంచి విండర్స్ ఈవీ కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కారు డిజైన్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంది. ఈ మోడల్ ఎల్ ఈడీ హెడల్ ల్యాంప్స్ ఆకర్షిస్తున్నాయి. అలాగే ఎల్ ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఫ్రంట్ రియర్ వంటివి అమర్చారు. ఎల్ ఆకారంలో ఉన్న ఎల్ ఈడీడీ లైట్స్, ప్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ , అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారులో 5గురు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. టర్కోయిస్ గ్రీన్, పెర్ల వైట్, స్టార్బర్ బార్ట్స్ అనే కలర్లలో అందుబాటులో ఉంది.
కొత్త ఎంజీ బ్యాటరీ ప్యాక్ 38 కిలో వాట్స్ ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 331 కిలో మీటర్లమైలేజ్ వస్తుంది. ఈ మోటార్ ద్వారా 134 బీహెచ్ పీ పవర్, 200 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే కిలోమీటర్ కు రూ.3.50 చెల్లించాల్సి వస్తుంది. ఎంజీ మోటార్స్ విండర్స్ ఇన్నర్ ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇనుస్టుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్ ఫోర్ట్, కీలెస్ ఎంట్రీ, ఫుష్ బటన్ వంటివి కొత్తగా కనిపిస్తాయి.
ఎంజీ విండర్స్ ప్రత్యేక సేప్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇక దీనిని కొనాలని ఆసక్తి ఉన్న వారికి శుభవార్త తెలిపింది. ఎంజీ కొత్త విండర్స్ ను రూ. 9.99 లక్షలకే అందించనుంది. ఇది జేఎస్ డబ్ల్యూ సహకారంతో మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో ఉన్న టాటా కంపెనీ కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆటోమోబైల్ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
ప్రస్తుతం ఆటోమోబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 60 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు సైతం వీటిని ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్స్ నుంచి కొత్తగా రిలీజ్ అయినా విండర్స్ గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. లో బడ్జెట్ లో ఈవీని కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.