Hymenoplasty Surgery : భారతదేశం సాంప్రదాయాలు కలిగిన భూమి. ఇక్కడ ఎక్కువగా కట్టుబాట్లకు విలువ ఇస్తారు. ముఖ్యంగా మనుషుల మధ్య సంబంధాలు బాగా ఉండేలా కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. చాలా కాలం నుంచి ఒకరి నుంచి ఒకరి తరువాత ఈ పద్ధతులు, కట్టుబాట్లు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం డెవలపింగ్ పేరుతో మనుషుల మనస్తత్వాలు మారిపోతున్నాయి. వారికి కొత్త అలవాట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పాత పద్దతులు, కట్టుబాట్లకు పాతరేస్తున్నారు. ముఖ్యంగా నేటి కాలం కొందరు అమ్మాయలు కొన్ని కొత్త పద్ధతుల్లో వెళ్లున్నారు. పెళ్లి అనే సాంప్రదాయాన్ని పక్కనబెట్టి పెళ్లికి ముందే కొన్ని వ్యసనాలకు పాల్పడతున్నారు. ఈ క్రమంలో వారు ఎక్కువగా హైమెనోప్లాస్టీ అనే సర్జరీని ఎక్కువగా చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్నవారు ఈ సర్జరీ కోసం ఆసుపత్రులను సంప్రదించినట్లు షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
హైమెనోప్లాస్టీ ని హైమెన్ రిస్టోరేషన్ సర్జరీ అంటారు. సాధారణగా ఒక అమ్మాయి కన్య అని తేలేందుకు ఆమె శారీరక సంబంధం కలిగి ఉన్నదా? లేదా? అనేది రుజువు చేస్తారు. కనత్వ పొర పగిలిపోకుండా ఉంటే ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేదని తెలుస్తోంది. దీంతో పెళ్లయిన తరువాత ఫస్ట్ నైట్ భర్త ఆ విషయాన్ని గ్రహించడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయి. అయితే ఇటీవల పెళ్లికి ముందే కొంత మంది ఇతరులతో సంబంధాలను కలిగి ఉంటారు. ఈ క్రమంలో వారు పెళ్లయిన తరువాత తాము ఎటువంటి వారితో సంబంధాన్ని కలిగి ఉండలేదని తెలిపేందుకు హైమెనోప్లాస్టీ సర్జరీ చేయించుకుంటున్నారు.
హైమెనోప్లాస్టీ అనగా స్ట్రీ యోనిలోనికి ఏవైనా కణాలు ప్రవేశించి ఇన్ ఫెక్షన్ కాకుండా చేయించుకుంటారు. సాధారణంగా ప్రతి స్త్రీ హైమెన్ తోనే జన్మిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల కొందరికి హైమెన్ ఉండదు. అయితే హైమెన్ ఉన్న వారికి మొదటిసారి సంభోగంలో పాల్గొంటే ఇది పగిలిపోతుంది. దీంతో రక్తస్రావం ఏర్పడతుంది. కానీ కొందరు పెళ్లికి ముందు ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల,గుర్రపు స్వారీ చేయడం, స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల కూడా పగిలిపోవచ్చు. దీంతో ఈ సమస్య నివారణకు శస్త్ర చికిత్స చేయించుకుంటారు.
అయితే ఇదే అదనుగా కొందరు పెళ్లి కి ముందు ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల హైమెన్ పగిలిపోతుంది. అయితే పెళ్లయిన తరువాత భర్తకు అనుమానం రాకుండా ఉండడానికి చాలా మంది ఈ శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు షాకింగ్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. వాస్తవారికి ఇది ఇతర దేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతకాలంలో భారత్ లో ఈ శస్త్ర చికిత్సలు పెరిగిపోతున్నట్లు నివేదికలు బయటకు వచ్చాయి. హైమెనోప్లాస్టీ శస్త్ర చికిత్స సమస్య ఉన్న వారు చేయించుకోవడం ఒక రకమైతే..కావాలనే శారీరక సంబంధాలు ఏర్పాటు చేయించుకొని హైమనోప్లాస్టీ చేయించుకునేవారి సంఖ్య పెరిగిపోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం పెళ్లయిన తరువాత బయటపడితే సంబంధాలు చెరిగిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోయే ప్రమాదం లేకపోలేదని కొందరు హెచ్చరిస్తున్నారు.