https://oktelugu.com/

Anchor Suma: స్టేజ్ పై డాన్స్ తో ఇరగదీసిన యాంకర్ సుమ… క్రేజీ వీడియో వైరల్!

స్పార్క్ ది లైఫ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ యాంకరింగ్ చేశారు. పనిలో పనిగా స్పార్క్ మూవీలోని ఓ పాటకు డాన్సర్స్, హీరో, హీరోయిన్స్ తో కలిసి డాన్స్ చేసింది. సుమ కనకాల డాన్స్ అద్భుతంగా ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2023 / 10:27 AM IST

    Anchor Suma

    Follow us on

    Anchor Suma:  యాంకర్ సుమ మల్టీ టాలెంటెడ్. ఈ విషయంలో సందేహం లేదు. ఆమె సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఆమెకు మూడు నాలుగు భాషలపై పట్టు ఉంది. ముఖ్యంగా తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. రెండు దశాబ్దాలుగా ఆమెకు తిరుగు లేకుండా పోయింది. సుమ నటి కూడాను. ఆమె డాన్స్ కూడా ఇరగదీస్తోందని తాజాగా తెలిసింది. ఓ సినిమా ఈవెంట్ లో సుమ యాంకరింగ్ తో పాటు డాన్స్ చేశారు. సుమ డాన్స్ కి వేదిక ముందున్న గెస్ట్స్ ఆశ్చర్యపోయారు.

    స్పార్క్ ది లైఫ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ యాంకరింగ్ చేశారు. పనిలో పనిగా స్పార్క్ మూవీలోని ఓ పాటకు డాన్సర్స్, హీరో, హీరోయిన్స్ తో కలిసి డాన్స్ చేసింది. సుమ కనకాల డాన్స్ అద్భుతంగా ఉంది. సుమలో ఈ టాలెంట్ కూడా ఉందని జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. నిజానికి సుమ హీరోయిన్ కావాలనే పరిశ్రమకు వచ్చారు. మలయాళీ అమ్మాయి అయిన సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.

    దీంతో టాలీవుడ్ లో ఆమె అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు సుమ హీరోయిన్ గా కళ్యాణ ప్రాప్తిరస్తు టైటిల్ తో 1996లో ఓ మూవీ చేశాడు. ఈ చిత్రంలో వక్కంతం వంశీ హీరో కావడం మరో విశేషం. ఈ సినిమా ఆడలేదు. మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.

    ప్రస్తుతం కొడుకును హీరోగా పరిచయం చేస్తుంది. సుమ కనకాల నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయి రోషన్ హీరోగా బబుల్ గమ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇటీవల రాజీవ్-సుమ మధ్య విబేధాలు తలెత్తాయని వాదనలు వినిపించాయి. ఈ పుకార్లకు సుమ దంపతులు చెక్ పెట్టారు.