డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. కోటీశ్వరులు కావాలని చాలా మంది కలలు కంటారు. అయితే తమ గమ్యాన్ని చేరుకునేందుకు కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ వచ్చిన ఆదాయాన్ని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టలేక నష్టపోతుంటారు. మరికొందరు తక్కువ పనిచేసి ప్రణాళిక ద్వారా ఇన్వెస్ట్ మెంట్ భారీగా లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం ఎంతున్నా దానిని క్రమ పద్ధతిలో ట్రాన్స్ ఫర్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 30 ఏళ్ల వయసులో ఓ ఫార్మూలాను ఉపయోగించి కొంత వరకు పెట్టుబడి పెట్టినట్లయితే 15 ఏళ్ల లో అంటే 45 ఏళ్లు వచ్చే సరికి కోటీశ్వరులవుతారు. అదెలాగంటే?
ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేసినా ప్లాన్ ప్రకారం లేకపోతే ఆశించిన లాభాలు రావు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ కోటీశ్వరులవుతారని చెప్పలేం. కానీ ఒక రూట్ ప్రకారం పెట్టుబడులు పెడితే మాత్రం కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారని స్టాక్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ఫార్మూలా ఏంటంటే?
12-15-20.. ఈనెంబర్ చూస్తే ఏదో సమయాన్ని తెలుపుతుందని అనిపిస్తుంది. వాస్తవానికి ఈ పెట్టుబడి అలాంటిదే. ఇందులో ఉన్న మూడు అంకెట్లో మొదటి 12 అనేది పెట్టుబడులో 12 శాతం రిటర్న్ వస్తుందని అర్థం. 15 అనేది టెన్యూర్. అంటే 15 ఏళ్ల పాటు కాల పరిమితిని నిర్ణయించుకొని ఇన్వెస్ట్ మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరికి 20 అనేది.. నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేయాలి. ఇలా ఈ ఫార్మూలా ద్వారా పెట్టుబడులు పెట్టుడం ద్వారా 15 ఏళ్లల్లో కోటీశ్వరులు కావొచ్చు. అదెలాగంటే?
ఉదాహరణకు ఒక వ్యక్తి సిప్ ద్వారా ఏదైనా నచ్చిన పథకం ద్వారా నెలకు రూ.20 వేల పెట్టుబడిని పెడుతూ వెళ్తుంటే.. 15 సంవత్సరాలకు 36 లక్షలు అవుతుంది. ఎన్ ఐపీ ప్రకారం 64,91,520 వడ్డీ 12 శాతం చొప్పున వస్తుంది. అంటే మొత్తం ఒక కోటి 91,520 రూపాయలు ఆర్జిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఇంకా ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. నెలకు రూ.10 వేల చొప్పున నిర్ణయించుకొన్నా మంచి ఆదాయమే లభిస్తుంది. అందువల్ల ఇతర వాటికి కాకుండా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ మెంట్ చేసి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.