Bike Start  : బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఇలా చేస్తే.. పార్ట్స్ ఔట్.. వెంటనే తెలుసుకోండి..

బైక్ లేదా స్కూటర్ ను ఉదయం స్టార్ట్ చేసే సమయంలో చాలా మందికి అవగాహన లేకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ ను అధిగమించితే బైక్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఉదయం లేచిన సమయంలో బైక్ స్టార్ట్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

Written By: Chai Muchhata, Updated On : September 16, 2024 10:57 am

Bike Start

Follow us on

Bike Start  : సామాన్యుల ఇళ్లల్లో కచ్చితంగా ఓ టూ వీలర్ ఉంటుంది. ఇంటి అవసరాలతో పాటు ఆఫీసు, ఇతర పనులకు ద్విచక్ర వాహనం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే టూ వీలర్ ను ఎంత జాగ్రత్తగా ఉంచితే అంత లైఫ్ వస్తుంది. జాగ్ర్తత్తగా ఉంచుకోవడం అంటే మిగతా పనులను పక్కనబెట్టి బైక్ ను మాత్రమే చూసుకోవడం కాదు. మనం ప్రతి రోజు చేసే కొన్ని పనుల్లోనే కొన్ని నిర్లక్ష్యంగా కాకుండా సరిచేసుకోవడం. ముఖ్యంగా బైక్ లేదా స్కూటర్ ను ఉదయం స్టార్ట్ చేసే సమయంలో చాలా మందికి అవగాహన లేకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ ను అధిగమించితే బైక్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఉదయం లేచిన సమయంలో బైక్ స్టార్ట్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

పొద్దు పొద్దునే ఏదైనా అర్జంట్ పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వెంటనే స్టార్ట్ చేసిన టపీ మని గేర్ వేసి ముందుకు వెళ్తుంటారు. అలాగే కొందరు బైక్ స్టార్ట్ కాకున్నా.. బలవంతంగా స్టార్ట్ చేసి వెంటనే గేర్లు మార్చి ముందుకు వెళ్తారు. అయితే ఇలా వెళ్లడం అంత మంచిది కాదని ఆటోమోబలై్ నిపుణుులు పేర్కొంటున్నారు. బైక్ ను స్టార్ట్ చేసిన వెంటనే ఇలా గేర్ మార్చడం వల్ల ఇంజిన్ పై ప్రభావం పడుతుంది. దీంతో ఎక్కువ కాలం పనితీరు మెరుగ్గా ఉండదు.

రాత్రి బైక్ ను ఒకే దగ్గర నిలిపి ఉంచుతారు. ఈ సమయంలో ఇంజిన్ లోపల ఆయిల్ ఒకే ప్రదేశంలో ఉండిపోతుంది. అయితే ఉదయం బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ సరైన స్పార్క్ కు రావడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఈ సమయం పూర్తి కాకుండానే గేర్ మార్చడం వల్ల బైక్ పార్ట్స్ పై ప్రభావం పడుతుంది. దీంతో కొన్ని పార్ట్స్ వెంటనే అరిగిపోతాయి. చలికాలంలో ఇలా బైక్ స్టార్ట్ చేసిన వెంటనే గేర్ మార్చడం వల్ల సరైన స్పార్క్ నిర్వహించక వివిధ పార్ట్స్ దెబ్బతింటాయి.

అందువల్ల బైక్ స్టార్ట్ చేసిన తరువాత కనీసం 10 నుంచి 20 సెకన్ల వరకు అలాగే వేచి ఉండండి. లేదా ఇంజిన్ వేడి కావడానికి కాస్త ఎక్స్ లేటర్ ఇస్తూ ఉండండి. ఆ తరువాత మెల్లగా గేర్ వేసి ముందుకు వెళ్లడం మంచిది. అయితే ఇలా స్టార్ట్ చేసిన తరువాత కూడా 20 కిలోమీటర్ల వరకు సాధారణ స్పీడులోనే వెళ్లడం మంచిది. ఆ తరువాత ఎక్కువ స్పీడ్ వెళ్లినా ఎలాంటి సమస్య ఉండదు. ఈచిన్న పాటి టిప్స్ పాటించడం వల్ల బైక్ ను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుకోవచ్చు.

బైక్ ఎప్పుడు వెచ్చగా ఉండడం వల్ల ఆయిల్ స్పార్స్ సరైన విధంగా పనిచేస్తుంది. దీంతో ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా జరిగి బైక్ మూవింగ్ చక్కగా ఉంటుంది. లేకుంటే మిగతా పార్ట్స్ పై కూడా ప్రభావం పడి తొందరగా చెడిపోయే ప్రభావం ఉంది. వర్షాకాలంలోనూ బైక్ ఎక్కువ సేపు నీటిలో ఉండడం వల్ల వెంటనే స్టార్ట్ అవదు. ఒకవేళ స్టార్ట్ అయిన తరువాత వెంటనే గేర్ వేయకుండా కాస్త వేడి అయ్యేలా వెయిట్ చేయడం మంచింది.