https://oktelugu.com/

 Home Loan : హోమ్ లోన్ తీసుకునే ముందు కనిపించని ఈ ఛార్జీలను గమనించారా? ముందే తెలుసుకోండి..

బ్యాంకు రుణం తీసుకునే ముందు లోన్ ఇచ్చే వారు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. ఇవి కొన్ని బ్యాంకులు ఆఫర్ల కింద మినహాయిస్తున్నట్లు చెబుతారు.కానీ ఒక బ్యాంకు లోన్ ఇచ్చే ముందు కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కానీ వీటితో పాటు ఐడీ లాగిన్ కావడానికి అదనంగా ఛార్జీలు వసూలు చేరస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2024 / 08:50 PM IST

    Home Loan

    Follow us on

    Home Loan :  ప్రస్తుత కాలంలో ఇల్లు నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. ఇంటి నిర్మాణ సామగ్రి పెరిగిపోవడంతో పాటు కొత్త ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కొందరు జీవితాంతం కష్టపడినా ఇంటి నిర్మాణానికి తగినంత సంపాదన ఉండడం లేదు. దీంతో కొందరు ముందుగానే బ్యాంకు రుణం తీసుకొని ఇల్లు నిర్మించుకుంటున్నారు. మిగతా రుణాల కంటే ఇంటి నిర్మాణానికి లోన్ ఇవ్వడానికి చాలా బ్యాంకులు ముందుకువస్తుంటాయి. ఎందుకంటే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వారి ఆధీనంలో ఉంటాయి. అంతేకాకుండా ఇల్లు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నెలనెలా ఈఎంఐ చెల్లించడానికి ముందుకు వస్తారు. అయితే బ్యాంకు లోన్ ఇవ్వడానికి ప్రస్తుతం కాలలో చాలా బ్యాంకులు ముందుకు వచ్చినా.. లెక్కలేనన్ని షరతులు పెడుతూ ఉంటారు. వీటిలో కొన్నింటికి ఛార్జీలు కూడా విధిస్తారు. కొన్ని కొన్నింటి ఛార్జీలు గురించి మాత్రమే బయటకు చెబుతారు. మిగతా వాటి గురించి చెప్పరు. వాటి గురించి వివరాల్లోకి వెళితే..

    బ్యాంకు రుణం తీసుకునే ముందు లోన్ ఇచ్చే వారు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. ఇవి కొన్ని బ్యాంకులు ఆఫర్ల కింద మినహాయిస్తున్నట్లు చెబుతారు.కానీ ఒక బ్యాంకు లోన్ ఇచ్చే ముందు కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కానీ వీటితో పాటు ఐడీ లాగిన్ కావడానికి అదనంగా ఛార్జీలు వసూలు చేరస్తారు. ఇవి రూ.6 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. రుణ ఒప్పందం కోసం కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కొనుగోలు చేస్తారు. వీికి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు.

    రుణం తీసుకునే ముందు ఖాతాదారుని సిబిల్ స్కోర్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా ఏదైనా యాప్ ల ద్వారా ఉచితంగానే చెక్ చేసుకోవచ్చు. కానీ లోన్ ఇచ్చే వారు అధికారికంగా బ్యాంకు నుంచి వారి సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసినందుకు బ్యాంకు వారు ఛార్జీలు వసూలు చేస్తారు. ఇవే కాకుండా ఐటీ రిటర్న్స్ బ్యాంకులకు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిని ఖాతాదారుడు తీసుకొచ్చినా దీని అగ్రిమెంట్ కాపీని అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది.

    ఇక ఖాతాదారుడి బ్యాంకు స్టేట్మెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కనీసం మూడు నెలల పాటు డాక్యుమెంట్ల రూపంలో తీసుకుంటారు. వీటి ప్రింట్ కోసం అదనంగా ఛార్జీలు వేస్తారు. గృహ రుణాన్ని ఎక్కువ శాతం ఇంటి పత్రాలు తనఖా పెట్టుకొని ఇస్తారు. వీటి పరిశీలన నిమిత్తం ప్రత్యేకంగా ఒకరోజు తీసుకుంటారు. వీటి ఛార్జీలను వేస్తారు. ఇవేకాకుండా టైటిల్ డీడ్ ఛార్జ్, తదితర ఖర్చులను అదనంగా విధిస్తారు.

    బ్యాంకు లోన్ తీసుకునే సమయంలో కేవలం ప్రాసెసింగ్ ఫీజు గురించి మాత్రమే చెబుతారు. ఇవన్నీ తప్పనిసరి అని ఆ తరువాత ఎక్కువగా వసూలు చేస్తారు. అందువల్ల లోన్ తీసుకునే ముందు ఈ ఛార్జీలు ఎంత వరకు ఉన్నాయి? ఏ విధంగా వసూలు చేస్తారు? అనే విషయాలను ముందే తెలుసుకోవాలి. ఆ తరువాత ఏ బ్యాంకులో తక్కువగా అదనపు ఛార్జిలు విధిస్తున్నారో తెలుసుకొని సదరు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం మంచిది.