https://oktelugu.com/

Car Insurance: ఈ రెండు పనులు చేస్తే కారుకు ఇన్సూరెన్స్ వర్తించదు.. వెంటనే రిజక్ట్ చేస్తారు..

టూ వీలర్ కంటే 4 వీలర్ నడిపేవారు వాహనం గురించి, డ్రైవింగ్ విధానాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. కారు ఇన్సూరెన్స్ కొన్నింటికి మాత్రమే పనిచేస్తుంది. కారు సరైన క్రమంలో వెళ్లిందా? అనుకోకుండానే ఈ ప్రమాదం జరిగిందా?

Written By:
  • Srinivas
  • , Updated On : July 26, 2024 / 03:49 PM IST

    Car Insurance

    Follow us on

    Car Insurance: కారు ఉన్న ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా కారు డ్రైవింగ్ పై అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాత డ్రైవింగ్ నిబంధనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఆ తరువాత కారు కొనుగోలు చేసేటప్పుడు కారకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. వీటిలో కారు ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. 4 వీలర్ కొనేటప్పుడు కొన్ని సంవత్సరాల వరకు కంపెనీలే ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. ఆ తరువాత సొంతంగా కారుకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అయితే ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు అందులో ఉండే విషయాలను తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీలకు అనుగుణంగా కారు ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దీంతో తీవ్రంగా నష్టపోతారు. ఒక కారు ప్రమాదాల వల్ల డ్యామేుజ్ అయినప్పుడు వెంటనే ఇన్సూరెన్స్ వాళ్లకు కాంటాక్ట్ అవుతారు. అయితే ముందుగా ఇన్సూరెన్స్ ప్రతినిధులు కారుకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుంటారు. ఆ తరువాత యాక్సిడెంట్ జరిగిన సంఘటన తీరు గురించి ఎంక్వైరీ చేస్తారు. అన్నీ పరిశీలించాక ఓకే ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. కొందరు వివిధ కారణాలతో ప్రమాదాలు జరిగినా ఇన్సూరెన్స్ పాలసీకి క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఈ కంపెనీలు ముందుగానే ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. అందువల్ల ముందుగా వాటిని పరిశీలించిన తరువాతే ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కారు ఇన్సూరెన్స్ ఉన్నా.. ఈ విషయాలకు విరుద్ధంగా ఉంటే క్లెయిమ్ చేసే అవకాశం ఉండదు. అదేంటంటే?

    టూ వీలర్ కంటే 4 వీలర్ నడిపేవారు వాహనం గురించి, డ్రైవింగ్ విధానాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. కారు ఇన్సూరెన్స్ కొన్నింటికి మాత్రమే పనిచేస్తుంది. కారు సరైన క్రమంలో వెళ్లిందా? అనుకోకుండానే ఈ ప్రమాదం జరిగిందా? కొందరు డంకెన్ డ్రైవ్ చేస్తారు. ఇలా చేసినట్లు ఇన్సూరెన్స్ వాళ్లు క్లెయిమ్ ను రిజెక్టు చేస్తారు. ఎందుకంటే మద్యం తాగి వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు ఇన్సూరెన్స్ వర్తించదు. అలాగే కావాలనే రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ ఇవ్వవు. ఒకవేళ ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీ కాల పరిమితి ఒక్కరోజు దాటినా కారుకు ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలాంటి వాటి విషయంలో ఇన్సూరెన్స్ కోసం చేసుకున్నా రిజెక్ట్ చేస్తారు.

    కొందరు కారు వాడే విషయంలో నిబంధనలను పట్టించుకోరు. ఉదాహరణకు ట్రావెల్ కు వాడే వాహనాలకు పసుపు కలర్ నెంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యాపారం కోసం వినియోగిస్తున్నామని తెలియజేస్తుంది. అదే వైట్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటే ఇది సొంతానికి వాడుతున్నారని తెలుపుతుంది. అయితే ఒక్కోసారి వైట్ కలర్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనం కమర్షియల్ గా వాడినప్పుడు, ఈ సమయంలో కారు ఏదైనా ప్రమాదానికి గురైన కారుకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ వర్తించదు. ఎందుకంటే సొంతానికి వాడుకోవడానికి తీసుకున్న కారును నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం కోసం వినియోగించడం కరెక్ట్ కాదు.

    అయితే సొంతానికి వాడుకునే కారును కమర్షియల్ కోసం వాడుకోవాల్సి వస్తే ఆ విషయం ఇన్సూరెన్స్ వాళ్లకుత తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో ఈ కారు ఏదైనా సందర్భంలో ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. లేకపోతే దీనిని రిజక్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు కారకు సంబంధించిన పత్రాలు అన్నీ ఉండాలి. వీటిలో ఏది మిస్సయినా క్లెయిమ్ వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల వాహనదారులు ఇన్సూరెన్స్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆటోమోబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.