Home Minister Anitha: ఏపీలో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 స్థానాలకు గాను 11 సీట్లకే పరిమితం అయ్యింది.అసెంబ్లీకి వచ్చేందుకు కూడా జగన్ ఆసక్తి చూపడం లేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న బాధ ఆయనలో వ్యక్తం అవుతోంది. సభకు వెళ్తే ఈ స్థాయిలో అవమానిస్తారో కూడా జగన్ కు తెలుసు.అందుకే సభకు వెళ్లడం వేస్ట్ అని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి జగన్ లో ప్రస్టేషన్ కనిపిస్తోంది. కానీ శాసనమండలిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఏకపక్ష విజయంతో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి.తాజాగా శాసనమండలిలో హోం మంత్రి వంగలపూడి అనితకు సాక్షాత్ చైర్మన్ మోసేన్ రాజు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తావిస్తూ అనిత చేసిన కామెంట్స్ పై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖఅసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదనతో ఉన్నారని అనిత వ్యాఖ్యనిస్తుండగా మండలి చైర్మన్ అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం పద్ధతి కాదని తేల్చి చెప్పారు. వాటిని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా మండలి చైర్మన్ నుంచి ఆ తరహా సమాధానం రావడంతో హోంమంత్రి అనిత షాక్ కు గురయ్యారు. ఆ అంశం నుంచి పక్కకు వెళ్లి పోవాల్సి వచ్చింది.
* వైసీపీ దే పై చేయి
శాసనమండలిలో వైసీపీ దే బలం. 58 ఎమ్మెల్సీ సీట్లకు గాను.. 38 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. ఇటీవలే వైసిపి శాసనమండలి పక్ష నేతగా లేళ్ల అప్పి రెడ్డి నియమితులయ్యారు. మొన్నటి వరకు వైసిపి అధికార పార్టీ కావడంతో చైర్మన్ ఆ పార్టీకి చెందిన వారే కొనసాగారు. మండలిలో వైసిపి పక్ష నేత అవసరం లేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిందో వైసిపి పక్ష నేత ఎంపిక అనివార్యంగా మారింది.
* జగన్ ధైర్యం అదే
శాసనసభలో వైసిపికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ శాసనమండలిలో మాత్రం ఆధిపత్యం వైసిపిదే. జగన్ ధైర్యం కూడా అదే. వైసిపి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ వారికి దిశా నిర్దేశం చేశారు. మూడేళ్ల వరకు శాసనమండలిలో మనదే ఆధిపత్యం అని.. టిడిపి కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకుందామని కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏకంగా హోంమంత్రి అనితను శాసనమండలి చైర్మన్ నియంత్రించడం అవమానంగా భావిస్తున్నారు.
* శాసనమండలి చైర్మన్ ఆగ్రహం
సాధారణంగా ఏ సభలోనైనా మంత్రుల ప్రకటనలకు సభ్యులు అడ్డు తగులుతారు. కానీ తమ పార్టీకి చెందిన కీలక నేత వ్యక్తిగత వ్యవహారంపై మాట్లాడడంతో శాసనమండలి చైర్మన్ కు ఒక్కసారిగా ఆగ్రహం కలిగింది. ఏకంగా ఆయనే స్పందించారు. సభలో లేని మనుషుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. అయితే గతంలో చాలా రకాల ఆరోపణలు వచ్చాయని.. సభలో లేని వ్యక్తుల గురించి కూడా వైసిపి సభ్యులు వ్యాఖ్యానించారని.. అప్పుడు శాసనమండలి చైర్మన్ ఎందుకు నియంత్రించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక మహిళ మంత్రి, అ పై ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిపై శాసనమండలి చైర్మన్ అలా వ్యాఖ్యానించడం తగదని టిడిపి సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు.