https://oktelugu.com/

MS Dhoni: మాల్దీవుల వివాదం : సంచలనంగా మారిన ధోని మాటలు…వైరల్ వీడియో…

ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ లక్షద్వీప్ ని పర్యటించడం పైన కొంతమంది మాల్దీవుల నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం స్టార్ట్ అయింది.

Written By: , Updated On : January 9, 2024 / 03:04 PM IST
MS Dhoni

MS Dhoni

Follow us on

MS Dhoni: ప్రస్తుతం లక్షద్వీప్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన విషయం ఏంటి అంటే మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ లక్షద్వీప్ ని పర్యటించడం పైన కొంతమంది మాల్దీవుల నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం స్టార్ట్ అయింది…

అయితే మనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన మాల్దీవుల నేతల పైన సినీ, క్రికెట్ సెలబ్రిటీలు సైతం గట్టి కౌంటర్లను ఇస్తున్నారు సీనియర్ క్రికెటర్లు అయిన వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్,సురేష్ రైనా, అలాగే బాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన అమితాబచ్చన్ లాంటివారు మాల్దీవుల మంత్రులు చేసిన వాక్యాల్ని తిప్పికొడుతూ మాల్దీవులను మించిన ఎన్నో అందమైన, సుందరమైన ప్రదేశాలు భారత్ లో చాలా ఉన్నాయి.కాబట్టి ఇప్పుడు మనం మన పర్యాటక రంగానికి మద్దతు తెలిపాల్సిన సమయం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు… అయితే ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని గతంలో భారత పర్యాటకం పైన చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియోలో ధోని మాట్లాడుతూ నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తాను కానీ వెకేషన్ కోసం కాదు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆయా దేశాలలో ప్రయాణించినప్పుడు ఉన్న కొన్ని అందమైన ప్లేసెస్ ని చూడ్డానికి ఎక్కువ ఇష్టపడుతూ చూస్తూ ఉండేవాడిని. ఇక ఇప్పుడు నా భార్యకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఇప్పుడు నేను కూడా క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాను కాబట్టి ఇంట్లో ఫ్రీగానే గడుపుతున్నాను. అందుకే ప్రపంచం మొత్తం ఒకసారి టూర్ వేసి రావాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ఈ టూర్ ని మాత్రం ఇండియా నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానని తెలియజేశాడు…

ఇక ఇది ఇలా ఉంటే ఈ మాల్దీవుల వివాదం మీద ఇండియన్ పేస్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ కూడా మాట్లాడుతూ మన దేశంలో ఉన్న పర్యాటకాన్ని మనం ప్రోత్సహించుకోవాలి దానివల్ల మనకి మంచి జరుగుతుంది ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇండియా చాలా ముందుకు వెళుతుంది. కాబట్టి మనం ఆయనకు మద్దతు ఇవ్వాలంటూ షమీ పేర్కొన్నాడు…