Hyundai Ioniq EV: దేశంలో Top 10 కంపెనీల్లో Hyundai ఒకటి. మారుతి సుజుకీ, టాటా కంపెనీల తరువాత ఎక్కువ శాతం మంది హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేశారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ సైతం ఆకట్టుకునే మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రతీ ఏడాది అమ్మకాల్లో వృద్ధి నమోదు చేసుకుంటూ కంపెనీ ఆదరణ పొందుతోంది. 2024 ఏడాదిలో Hyundai కంపెనీ మొత్తం జనవరిలో 52,906 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరిలో 59, 858 కార్లను విక్రయించింది. దీంతో 12.85 శాతం అమ్మకాల్లో వృద్ధి సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే కంపెనీ ఓవరాల్ గా వృద్ధిని నమోదు చేసుకుంటున్నప్పటికీ దీనికి చెందిన ఓ కారు డీలా పడిపోయింది. ఆ కారు అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా?
Hyundai కార్లను కొందరు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తారు. హ్యాచ్ బ్యాక్ నుంచి SUV వరకు వివిధ వేరియంట్లలో మార్కెట్లోకి వస్తున్న ఈ కంపెనీకి చెందిన Creta వంటి కార్లు ఎక్కువగా ఆదరణ పొందాయి. వీటితో పాటు ప్రీమియం కార్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగపోతున్న తరుణంలో ఈ కంపెన నుంచి Ioniq ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఉన్న ఈ కారులో 72.6 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. ఇది 217 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది 350 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 631 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Ioniq కారులో 5గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లొచ్చు. ఇందులో 12.3 అంగుళాల ఇన్సోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, యాంబియంట్ లైటింగ్ తో పాటు డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటివి ఉన్నాయి. ప్రస్తుత కాలంలో అందరూ కోరుకునే పనోరమిక్ సన్ రూప్ ను అమర్చారు. సేప్టీ విషయంలో నూ ఈ కారు కంపెనీ కేర్ తీసుకుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
Hyundai Ioniq EV ప్రస్తుతం మార్కెట్లో రూ.46.05 లక్షలుగా ఉంది. ఇది మొత్తం 7 కలర్లలో అందుబాటులో ఉంది. అయితే ఈ కారు అమ్మకాలు గత నెలలో దారుణంగా పడిపోయాయి. 2025 జనవరిలో దీనిని 16 మంది మాత్రమే కొనుగోలు చేశారు. ఇదే కారును 2024 ఏడాది జనవరిలో 95 యూనిట్ల విక్రయాలు జరుపుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 83 శాతం అమ్మకాలు క్షీణించాయి. అయితే 2024 ఏడాది సెప్టెంబర్ లో 31, అక్టోబర్ లో 32, నవంబర్ లో 22 యూనిట్ల విక్రయాలు సాగాయి. దీంతో సెప్టెంబర్ నుంచి ఈ కారు అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగుతాయా? లేదా? అనేది చూడాలి.