Mahindra Thar
Mahindra Thar: సాధారణంగా ఒక కారు కొనుగోలు చేయాల్సి వస్తే షో రూంకు వెళ్లి అక్కడున్న నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని వస్తాం. కానీ కొన్ని ప్రత్యేకమైన కార్లు పొందాలంటే ముందే Book చేసుకోవాలి. కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తే వాటిని దక్కించుకోవడానికి కారు ప్రియులు ముందుగానే Book చేసుకుంటారు. ఇలా ముందే బుక్ చేసుకుంటే కనీసం నెలలోపు ఆ కారును పొందవచ్చని భావిస్తారు. కానీ ఓ కారును ముందే బుక్ చేసుకున్నా.. అది ఇంటికి రావడానికి 1.5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పటికే దీనిని చాలా మంది బుక్ చేసుకొని ఉన్నారు. వీరి డిమాండ్ కు తగిన విధంగా కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకే ఇది రావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ కారు లాంచ్ అయిన తొలి రోజే లక్ష మంది బుక్ చేసుకున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా. అయితే వెంటనే ఈ వివరాల్లోకి వెళ్లండి..
దేశంలో అగ్రగామి కార్ల కంపెనీల్లో Mahindra ఒకటి. దీని నుంచి మార్కెట్లోకి వచ్చే ఏ మోడల్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. మహీంద్రా కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చని Thar ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దీని కొనసాగింపుగా అప్డేట్ థార్ ను గత ఏడాది ఆగస్టు లో రిలీజ్ చేశారు. ఇందులో 3 డోర్, 5 డోర్ వెర్షన్లు ఉన్నాయి. అయితే 3 డోర్ కారకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనిని లాంచ్ అయిన మొదటి రోజే లక్ష మంది బుక్ చేసుకున్నారు. అయితే 5 డోర్ కారును సైతం చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపడంతో దీనికి డిమాండ్ పెరిగింది. దీంతో కంపెనీ ప్రధానంగా వీటి ఉత్పత్తిపైనే ఫోకస్ పెట్టింది. అయితే ఈ కార్లు వినియోగదారులకు అందాలంటే ఏడాదిన్నర కాలం సమయం పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
Mahindra Thar డిజైన్ అద్భుతంగా ఉంటుంది. దీని మొదటి కారు కంటే లేటేస్ట్ కారు కాస్త పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అమర్చారు. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ తో పాటు మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో రూ. 12 .99 లక్షల నుంచి రూ. రూ.13.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారు ధర రూ.21.59 లక్షల నుంచి రూ. 23.09 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
SUVవేరియంట్ లో ఎక్కువగా కార్లను అందించే మహీంద్రా.. థార్ ను సైతం అదే వెర్షన్ లో అందిస్తోంది. మిగతా కంపెనీల కార్లకు గట్టి పోటీ ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఫీచర్స్ , ఇంజిన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన వాహనాలను అందిస్తుంది. అందుకే ఈ కంపెనీ కార్లు ధర ఎక్కువగా ఉంటాయి. అయినా చాలా మంది మహీంద్రా కార్ల కొనుగోలుకు మొగ్గుచూపుతూ ఉంటారు.