Hyundai : దేశంలో భరించలేని ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా తమ వినియోగదారులను ఆకర్షించేందుకు, వారికి మరింత దగ్గర అయ్యేందుకు వాహనాల సాధారణ మెయింటెనెన్స్ ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్ సర్వీస్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 25 నుండి మే 6, 2025 వరకు భారతదేశంలోని అన్ని హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లలో నిర్వహించనున్నారు.
Also Read : ఫ్రాంక్స్, పంచ్‌లను కూడా దాటి హ్యుందాయ్ క్రెటా రికార్డ్ !
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఇది వాహన యజమానులకు వేసవిలో తమ వాహనాలకు కాపాడుకోవడానికి సాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ క్యాంపులో కారు 70 రకాల తనిఖీలు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తారు. ఇందులో వాహనం ఇంజిన్, సస్పెన్షన్, బ్రేకులు, ఎలక్ట్రికల్ సిస్టమ్‌లు ఉంటాయి. వేసవి కాలానికి ముందు కారులో కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. టైర్లు, లైట్ల తనిఖీ, కూలెంట్, ఇంజిన్ ఆయిల్ తనిఖీ చేయడం సాధారణంగా చేయాల్సిన పనులు.
ఈ కార్యక్రమంలో లిమిటెడ్ టైం సర్వీస్‌పై తగ్గింపు కూడా ఉంటుంది. కస్టమర్‌లు ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీపై 30 శాతం వరకు సాధారణ మెకానికల్ లేబర్, వీల్ అలైన్‌మెంట్, ఎయిర్ కండిషనింగ్ సర్వీస్‌పై 15 శాతం తగ్గింపు పొందవచ్చు. దీనితో పాటు సెలక్ట్ చేసిన మెకానికల్, ఏసీ భాగాలపై 10 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. హ్యుందాయ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పాలసీపై కూడా 10 శాతం తగ్గింపు ఉంది. ఇంటర్నల్, ఎక్సటర్నల్ శుభ్రతతో సహా కాస్మెటిక్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.
వెహికల్ మెయింటెనెన్స్ కారు పర్ఫామెన్స్, రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో డ్రైవర్లు అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటర్ ఇండియా డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం బ్రాండ్ పెరిగిన అమ్మకాల తర్వాత కస్టమర్‌లకు మెరుగైన సేవలను అందించే విధానంలో భాగమని అన్నారు. ముఖ్యంగా విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో వాహనాల మెయింటెనెన్స్, బ్రేక్‌డౌన్‌లను తగ్గించడానికి చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
Also Read : CNG కార్లలో ఏది బెస్ట్?