https://oktelugu.com/

Hyundai Exter: హ్యుందాయ్ ఎక్స్ టర్.. మళ్లీ పెరిగింది.. ఈ కారుకు ఎందుకింత డిమాండ్?

హ్యుందాయ్ ఎక్స్ టర్ లో 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ ను కలిగి ఉంది. పెట్రోల్ ఇంజిన్ 81.8 బీహెచ్ పీ, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 16, 2024 / 02:24 PM IST

    Hyundai Exter

    Follow us on

    Hyundai Exter: భారత ఆటోమోబైల్ మార్కెట్లో హ్యందాయ్ కంపెనీ ప్రత్యేకత చాటుకుంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎక్స్ టర్ (Exter) అమ్మకాల్లో వృద్ధి సాధించింది. మిగతా వాటికంటే ఈ మోడల్ టాప్ రేంజ్ లో ఉండడంతో దీని ధరను తాజాగా మళ్లీ పెంచారు. హ్యుందాయ్ ఎక్స్ టర్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సేఫ్టీ ఫీచర్లతో పాటు మైలేజ్ ఇచ్చే ఆప్షన్లు ఉన్నాయి. అలాగే ఎస్ యూవీ వేరియంట్లలో ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అయితే ఈ కారు ధర పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే?

    హ్యుందాయ్ ఎక్స్ టర్ లో 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ ను కలిగి ఉంది. పెట్రోల్ ఇంజిన్ 81.8 బీహెచ్ పీ, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ టర్ మొత్తం 7 వేరియంట్లు EX, EX(O), S, S(O), WSX, SX (O)లలో లభిస్తున్నాయి. అయితే ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. సీఎన్ జీ వేరియంట్ లో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులో ఉంటుంది.

    హ్యుందాయ్ ఎక్స్ టర్ గతంలో రూ.5,99,890 ప్రారంభ ధరతో విక్రయించారు. ఇటీవల ఈ మోడల్ అమ్మకాలు విపరీతంగా పెరగడంతో దీనిపై రూ.12,910 పెంచారు. ప్రస్తుతం రూ.6,12,800 తో అమ్ముతున్నారు. జనవరిలో కొన్ని కంపెనీలు కార్ల ధరలు పెంచుతున్నట్లు ముందే ప్రకటించాయి. అయితే హ్యుందాయ్ ఎక్స్ టర్ కు మాత్రం డిమాండ్ నేపథ్యంలో పెంచినట్లు కంపెనీ వర్గాలు తెలిపారు. అయితే ధర పెరిగినా అమ్మకాలు ఏమాత్రం తగ్గవనే ఆశాభావంతో ఉన్నారు.

    హ్యుందాయ్ ఎక్స్ టర్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆన్ బోర్డు నావిగేషన్, ఫుట్ లవెల్ లైటింగ్, డ్యాష్ క్యామ్, పార్క్ ఫిన్ యాంటైనా, వైర్ లెస్ ఛార్జింగ్ ఫ్యాడ్ వంటివి ఆకర్షిస్తున్నాయి. 4.2 ఇంచెస్ డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటోతో కలిగిన 8 ఇంచెన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఆకర్షిస్తోంది.