https://oktelugu.com/

Hyundai Creta: లేటేస్ట్ ఫీచర్స్ దూసుకొస్తున్న హ్యుందాయ్ క్రెటా.. లాంచింగ్ ఎప్పుడంటే?

హ్యుందాయ్ ఎస్ యూవీ క్రెటా లేటేస్ట్ వెర్షన్ ను 2024లో విడుదల చేయనున్నారు. అయితే అంతకంటే ముందే దీని ఫీచర్స్ ను రిలీజ్ చేశారు. ఈ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు 160 బీహెచ్ పీ పవర్ ను అందిస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 9, 2023 / 04:11 PM IST

    Hyundai Creta

    Follow us on

    Hyundai Creta: దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రసిద్ధ కంపెనీ హ్యుందాయ్ ఇప్పటికే ఎన్నో మోడళ్లను ఆవిష్కిరించింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుకులను తీసుకొస్తుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా క్రెటా వినియోగదారులను ఇప్పటికే విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఇది అప్డేట్ వెర్సన్ తో మార్కెట్లోకి రాబోతుంది. మరి దీని ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో చూద్దాం..

    హ్యుందాయ్ ఎస్ యూవీ క్రెటా లేటేస్ట్ వెర్షన్ ను 2024లో విడుదల చేయనున్నారు. అయితే అంతకంటే ముందే దీని ఫీచర్స్ ను రిలీజ్ చేశారు. ఈ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు 160 బీహెచ్ పీ పవర్ ను అందిస్తోంది. పాత వెర్షన్ 1.4 లీటర్ టర్బోన్ ను అందించగా దీనిని 1.5 లీటర్ కు అప్డేట్ చేశారు. అలాగే 253 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా డీసీటీ ఆటోమేటిక్ ప్యాడిల్ షిప్టర్స్ ప్లస్ డ్రైవ్ మోడ్ తో పనిచేస్తుంది.

    గంభీరంగా కనిపించే క్రెటా వీల్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. స్పోర్ట్స్ కారుకు తీసిపోని విధంగా హై లుక్ లో ఉంటుంది. కొత్ క్రెటా కొత్త వెర్నాకు కు పోటీ ఇస్తుంది. ఇందులో ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిజన్, లేన్ కీప్ అసిస్ట్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. 2.18 ఇంచెస్ కొత్త వీల్ తో పాటు అల్కాజార్ నుంచి రూపొందించిన 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తో పాటు స్టాప్ అండ్ గో, రియర్ టెక్నాలజీ ఆకర్షిస్తాయి.

    హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన పాత క్రెటాకే మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇది లేటేస్ట్ వెర్షన్ లో రావడంతో వినియోగదారులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 జనవరి 16న దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేస్తున్నారు. అంతలోపు ఫీచర్స్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఇక పాత క్రెటా రూ.19.20 లక్షల ఎక్స్ షో రూం ధరతో విక్రయిస్తున్నారు. కొత్త వెర్షన్ దీని కంటే ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు.