Hydrogen Car : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తరచూ హైడ్రోజన్ కారులో తిరుగుతుండడం తెలిసిందే. ఆయన స్వయంగా ఈ కారు గురించి అనేక వేదికల మీద మాట్లాడారు. అది టయోటా మిరాయ్, ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ కూడా తన సొంత హైడ్రోజన్ పవర్డ్ కారు హ్యుందాయ్ నెక్సోను భారతీయ రోడ్ల పైకి తీసుకొచ్చింది.
Also Read : టెస్లా హైడ్రోజన్ కార్లు.. త్వరలో మార్కెట్‌లోకి..
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ హైడ్రోజన్ కారు కూడా ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (Hydrogen Powered Fuel Cell Electric Vehicle – FCEV) టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ఈ కారు కోసం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఇండియన్ ఆయిల్‌తో డీల్
హ్యుందాయ్ మోటార్ ఇండియా, హైడ్రోజన్ పవర్డ్ వాహనాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. దీని ప్రకారం రెండు కంపెనీలు భారతదేశంలో హైడ్రోజన్ వాహనాల భవిష్యత్తు, దాని అవకాశాలను అన్వేషిస్తాయి. అంతేకాకుండా, హ్యుందాయ్ తన హైడ్రోజన్ కారు హ్యుందాయ్ నెక్సో ఒక యూనిట్‌ను కూడా ఇండియన్ ఆయిల్‌కు అందించింది.
ఈ హ్యుందాయ్ నెక్సో కారును భారతీయ రోడ్లపై 40వేల కిలోమీటర్ల వరకు నడిపి టెస్ట్ చేయనున్నారు. భారతీయ పరిస్థితుల్లో ఈ కారు పర్ఫామెన్స్, నమ్మకం, మెయింటెనెన్స్ అవసరాలను పరిశీలిస్తారు. ఈ కారు మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు ఎంత వస్తుందో ఈ పరీక్షల్లో అర్థం చేసుకుంటారు.
హైడ్రోజన్ కారు ఎలా పనిచేస్తుంది?
హైడ్రోజన్ కారులో ఇంధనంగా పెట్రోల్ లేదా డీజిల్ కాకుండా హైడ్రోజన్ గ్యాస్ నింపుతారు. తర్వాత ఈ కారు గాలి నుంచి ఆక్సిజన్‌ను తీసుకొని హైడ్రోజన్ సాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. దానిని కారులో అమర్చిన బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. ఈ బ్యాటరీ నుంచి కారుకు శక్తి లభిస్తుంది. అయితే, కారు సైలెన్సర్ నుంచి కేవలం నీటి తుంపర్లు మాత్రమే బయటకు వస్తాయి. ఈ కారు అస్సలు పొగను విడుదల చేయదు. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది.
Also Raed : ఇది వింటే షోరూంకు పరిగెత్తడం ఖాయం.. హ్యూందాయ్ బంపర్ ఆఫర్