భారతదేశంలో మిడిల్ క్లాప్ పీపుల్స్ ఎక్కువ. మార్కెట్ మొత్తం వీరి మీదే ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువు ఉత్పత్తి చేసినా వీరి కొనుగోలు శక్తి ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. అందువల్ల కొన్ని వస్తువులను తక్కువ ధరకే అందించడానికి ప్రయత్నిస్తారు. కార్ల విషయానికొస్తే ఈ మధ్య మిడిల్ క్లాస్ పీపుల్స్ పీపుల్స్ కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీరు లో బడ్జెట్ లో కారు కొనాలని అనుకున్నా.. మంచి ఫీచర్స్ కోసం ఎదురు చూస్తారు. కానీ ఫీచర్స్, ధరకు పొంతన ఉండదు కానాీ మారుతి కంపెనీ లో బడ్జెట్ లో హైబ్రిడ్ కారును అందిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
మారుతి కంపెనీకి చెందిన చాలా కార్లు మిడిల్ క్లాస్ కు అనుగుణంగానే ఉంటాయి. వీటిలో గ్రాండ్ విటారా ప్రత్యేకంగా ఉంటోంది. ఈ కారు 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. 116 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారాను రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 వరకు విక్రయిస్తున్నారు.
హైబ్రిడ్ ఇంజిన్ కలిగిన వాహనాలు ఒకప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు లో బడ్జెట్ తో ఈ కారును అందిస్తుండడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం గ్రాండ్ విటారా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో హెండ్స్ ఆప్ డిస్ ప్లే, హై టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. సేప్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ అలరిస్తాయి. లేటేస్ట్ టెక్నాలజీకి ఏమాత్రం తీసిపోని ఈ కారు కొనుగోలు కోసం ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రాండ్ విటారా మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ కారుతో పోటీ ఎదుర్కొన్న వాటిలో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టాటా హరియర్ వంటివి ఉన్నాయి. ఆ కార్లతో పోలిస్తే విటారా తక్కువ ధర ఉండడంతో పాటు మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ కారు అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. 2015 నుంచి హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో దూసుకుపోతుంది. ఈ కారును మారుతి గ్రాండ్ విటారా గట్టి పోటీ ఇస్తోంది.