Cars: ఈ కార్లను జాగ్రత్తగా కాపాడుకోండి.. లేకుంటే ఎత్తుకెళ్తారు..

మారుతి కంపెనీ నుంచి ఆకర్షణీయమై ఉత్పత్తులు మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. వీటిలో ముందుగా స్విఫ్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

Written By: Chai Muchhata, Updated On : October 26, 2023 5:39 pm

Cars

Follow us on

Cars: కొన్ని వస్తువులకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. డిమాండ్ ఉన్న వస్తువులను దక్కించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఎంత ఖర్చయినా వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కొనుగోలు చేయలేని పక్షంలో వాటిని పొందేందుకు కొందరు దొంగతనాలు కూడా చేస్తుంటారు. కొన్ని కంపెనీలకు చెందిన కార్లు ఇటీవల ఎక్కువగా చోరీకి గురైనట్లు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదులను భట్టి తెలుస్తోంది. అయా కార్ల ఫీచర్స్, డిజైన్ ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దొంగిలిస్తున్నారట. ఇంతకీ ఎక్కువగా చోరీకి గురవుతున్న కార్లు ఏవో తెలుసా?

మారుతి కంపెనీ నుంచి ఆకర్షణీయమై ఉత్పత్తులు మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. వీటిలో ముందుగా స్విఫ్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. స్విప్ట్ కారు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 1.2 లీటర్ ఫ్యూయెల్, 4 సిలిండర్ ను కలిగిన ఈ కారు రూ.5.99 ఎక్స్ షోరూం ధరతో విక్రయిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండటంతో ఈ మోడల్ ను చాలా మంది కొనుగోలు చేశారు. ఇదే సమయంలో కొందరు దీనిని పొందేందుకు దొంగతనాలకు పాల్పడ్డారు. తమ కార్లు పోయాయని ఫిర్యాదు చేసిన వారిలో స్విప్ట్ కస్టమర్లే ఎక్కువగా ఉన్నారట.

మారుతి కంపెనీకి చెందిన మరో బెస్ట్ మోడల్ వ్యాగన్ఆర్. 1.0 లీటర్, 3 సిలిండర్ ను కలిగిన ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ఏఎంటీ ఉంది. దీనిని రూ.5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ మోడల్ ప్రతీ ఏడాది ఎక్కువ అమ్మకాలు జరుపుకుంటోంది. అయితే ఈ కార్లు రీ సేల్ లోనూ అత్యధికంగానే ఉన్నాయి. ఈ కారు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా దేశంలో అత్యధికంగా విక్రయం జరుపుకుంటున్న కార్లలో ఒకటి గా నిలుస్తోంది. ఎస్ యూవీ లో ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. దీనిని రూ.11 లక్షల ప్రారంభ ధరతో అమ్ముతున్నారు. అయితే దీనికి కూడా దొంగతనాల బెడద ఎక్కువే. ఇదే కంపెనీకి చెందిన మో మోడల్ శాంట్రో. పాత మోడల్ ను రీ డీజైన్ చేసి తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీని విడిభాగాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ కారును జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.