Maruti Suzuki : కొత్త ఏడాది కొత్తకారులో తిరగాలనుకుంటున్నారా.. తక్కువ బడ్జెట్‌లో సెకండ్ హ్యాండ్ కొనాలనుకుంటున్నారా.. మీ బడ్జెట్ రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉందా.. అయితే ఈ అవకాశం మీకోసమే. కేవలం రూ.6 లక్షల లోపే మీరు కొత్తకారు కొనొచ్చు. పైగా, కంపెనీ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద రూ.65 వేల వరకు డిస్కౌంట్ పొందవచు‍్చ. ఇంత మంచి ఆఫర్ ఇస్తున్న కంపెనీ ఏది.. కారు ఎంతకు మన సొంతం అవుతుందో తెలుసుకుందాం.
క్లియరెన్స్ సేల్..
మరి కొన్ని రోజుల్లో 2023 ముగియనుంది. కొత్త ఏడాదిలో కస్టమర్లను ఆకర్శించేందుకు కార్ల తయారీ కంపెనీలు ఇయర్ ఎండ్ ఆఫర్లు తీసుకొస్తున్నాయి. తమ వాహనాలపై భారీ తగ్గింపు ఇస్తూ స్టాక్ క్లియర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మారుతి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇగ్నిస్‌పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. కస్టమర్లు ఈ ఆఫర్‌ను ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపొంలో పొందవచ్చు. కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఆఫర్ ఇలా..
మారుతి ఇగ్నిస్ కారుపై రూ.65 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అందులో రూ.40 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉండగా.. రూ.15 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10 వేల వరకు కార్పొరేట్ బోనస్ లభిస్తుంది. ఈ ప్రయోజనాలు 2023, డిసెంబర్ 31 వరకు మాత్రమే. అయితే డీలర్‌షిప్ ప్రాంతం, కారు రంగు, వేరియంట్, స్టాక్ లభ్యత, ఇతర అంశాలను బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది.
కారు ప్రత్యేకత..
ఇక మారుతి ఇగ్నిస్ ప్రత్యేకత చూస్తే.. దాని ఇంజిన్ గరిష్టంగా 83 పీహెచ్‌పీ శక్తి, 113 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్(ఏజీఎస్) గేర్‌బాక్స్ ఉంది. ఇగ్నిస్ ప్రీమియం, అప్‌డేట్ చేసిన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఈ కారులో ఐదుగురు సులభంగా కూర్చునే సదుపాయం ఉంది. స్మార్ట్ ప్లే స్టూడియో ఫీచర్‌తో కూడిన ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా కారులో ఉంది. ఈ కారులో కంపెనీ నెక్సా సేఫ్టీ షీల్డ్‌ను అందించింది. ఇగ్నిస్‌కు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక డోర్ చైల్డ్ లాక్, వెనుక పార్కింగ్ కెమెరా, ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ చైల్డ్ సీట్ లాక్ యాంకర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ధర రూ.5.84 లక్షలే..
మారుతీ సుజుకీ ఈ కారును తన నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ ద్వారా విక్రయిస్తోంది. దీని ధర రూ.5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతోంది. ఆపైన రూ.65 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఈ కారు టాప్ మోడల్ రూ.8.16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. భారతీయ మార్కెట్లో ఇది టాటా టియాగో, హ్యుందాయ్ ఐ10, టాటా పంచ్‌లకు పోటీగా ఉందని చెప్పవచ్చు.