Homeబిజినెస్Amazon Flipkart Sale: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్.. ధమాకా సేల్స్ త్వరపడండి

Amazon Flipkart Sale: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్.. ధమాకా సేల్స్ త్వరపడండి

Amazon Flipkart Sale: ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్స్‌ మొదలు పెట్టాయి. గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ డేస్‌పేరుతో అమేజాన్ గురువారం(మే 2)నుంచి, బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ శుక్రవారం (మే 3) నుంచి అమ్మకాలు ప్రారంభించాయి. వేర్వేరు ఉత్పత్తులపై వందల డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటల ముందు అంటే మే 1వ తేదీ అర్ధరాత్రి నుంచే డిస్కౌంట్‌ సేల్స్‌ అందుబాటులో వచ్చాయి. మొబైల్‌ ఫోన్స్, యాక్సెసరీస్, బ్యూటీ అండ్‌ ఫ్యాషన్‌ ఐటమ్స్, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌ వాచీలు, ఇయర్‌ బడ్స్, స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు ఇస్తున్నాయి సంస్థలు. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వన్‌ కార్డు క్రెడిట్‌ కార్డులపై కొనుగోలు చేయడంతో అదనపు డిస్కౌంట్లు పొందొచ్చు.

మే 2 మధ్యాహ్నం నుంచి..
అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ మే 2 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు ఒకటో తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత సేల్స్‌ మొదలవుతాయి. మొబైల్‌ ఫోన్స్, వాటి విడి భాగాలపై 45 శాతం వరకూ డిస్కౌంట్‌ లభిస్తుంది. వన్‌ప్లస్, రెడ్‌మీ, రియల్‌మీ వంటి ఫోన్లపై ధరలు తగ్గిస్తారు. వన్‌ప్లస్‌ 11ఆర్, రెడ్‌మీ 13సీ, ఐక్యూ జెడ్‌6 లైట్, రియల్‌మీ నార్జో 70ప్రో 5జీ, రెడ్‌మీ 12 5జీ ఫోన్లపై ధరల తగ్గింపు ఉంది.

80 శాతం వరకు డిస్కౌంట్‌..
ఇక లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు, హెడ్‌ఫోన్లపై 75 శాతం డిస్కౌంట్, టీవీలు, గృహోపకరణాలపై 65 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. సోనీ డబ్ల్యూహెచ్‌–1000 ఎక్స్‌ఎం4 వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు, అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ స్మార్ట్‌ వాచ్, ఆపిల్‌ ఐప్యాడ్‌ (పదవ జనరేషన్‌) వంటి మోడల్స్‌ రాయితీపై లభిస్తాయి. హోం, కిచెన్‌ ఉత్పత్తులపై 70 శాతం, ఫ్యాషన్‌∙ఉత్పత్తులపై 50, బ్యూటీ ఉత్పత్తులపై 80 శాతం రాయితీ లభిస్తుంది. అమేజాన్‌ ఎకో (విత్‌ అలెక్స్‌), ఫైర్‌ టీవీ, కైండిల్‌ డివైజ్‌లపై 45 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వన్‌ కార్డు క్రెడిట్‌ కార్డులపై అదనంగా 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు లభిస్తాయి.

మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌..
ఇక ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలపై అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్లతో ఫ్లిప్‌ కార్ట్‌ మరోసారి బిగ్‌ సేల్‌ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ సేల్‌ అందుబాటులోకి తెస్తుంది. ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్‌ వినియోగదారులు ఒకరోజు ముందే అంటే.. మే 2 నుంచే ఈ సేల్‌ అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతోపాటు గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై ఇప్పుడు ఇస్తున్న 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఈసేల్‌ లో వర్తిస్తుందని పేర్కొంది. ఎస్‌బీఐ కార్డు యూజర్లు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ చెల్లింపులపైనా డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

పే లేటర్‌ ఆఫర్‌..
ఫ్లిప్‌ కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది. రూపాయి చెల్లించకుండానే లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కొనుగోలు చేసిన వస్తువు ధరను వాయిదాల్లో చెల్లింపులు జరిపే అవకాశం కల్పించినట్లు వివరించింది. ఇక ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ అందించే అవకాశం ఉందని సమాచారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular