https://oktelugu.com/

ప్రూఫ్స్ లేకుండా ఆధార్ లో అడ్రస్ మార్చవచ్చు.. ఎలా అంటే..?

మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతూ ఉంటారు. ఆ సమయంలో కొత్త అడ్రస్ ను ఆధార్ కార్డ్ లో అప్ డేట్ చేసుకోవాలంటే ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో తాజాగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. అడ్రస్ ను మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 8, 2021 12:25 pm
    Follow us on

    Aadhar Update

    మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతూ ఉంటారు. ఆ సమయంలో కొత్త అడ్రస్ ను ఆధార్ కార్డ్ లో అప్ డేట్ చేసుకోవాలంటే ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో తాజాగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది.

    అడ్రస్ ను మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్ లైన్ లోనే సులభంగా అడ్రస్ ను అప్ డే చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్చుకోవాలని భావించే వాళ్లు మొదట ఆధార్ అధికారిక వెబ్ సైట్ అయిన యూఐడీఏఐ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత హోం పేజ్ లోని మై ఆధార్ సెక్షన్ కు వెళ్లి అప్ డేట్ యువర్ ఆధార్ పై క్లిక్ చేయాలి.

    ఆ తరువాత అప్ డేట్స్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్ లైన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రోసీడ్ టు అప్ డేట్ ఆధార్ పై క్లిక్ చేసి ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ పై క్లిక్ చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ ను నమోదు చేయాలి. లాగిన్ అయ్యాక అప్ డేట్ అడ్రస్ పై క్లిక్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ లేని వారు అడ్రస్ వాలిడేషన్ లెటర్ ను తీసుకోవాలి.

    అందులో ఉండే నాలుగు స్టెప్స్ ను పూర్తి చేస్తే అడ్రస్ వాలిడేషన్ లెటర్ పోస్ట్ లో వస్తుంది. ఆ లెటర్ వచ్చాక అందులో సీక్రెట్ కోడ్ ను ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను అప్ డేట్ చేయించుకోవచ్చు. ప్రాసెస్ పూర్తి చేసిన తరువాత మొబైల్ కు ఒక స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్ వస్తుంది. ఆ నంబర్ సహాయంతో అడ్ర‌స్ అప్‌డేష‌న్ స్టేట‌స్ ‌ను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.