Wari Energies IPO Allotment: వారీ ఎనర్జీస్ ఐపీఓ కేటాయింపును ఎలా తెలుసుకోవాలంటే?

సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీదారు అయిన వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ కు మంచి డిమాండ్ లభించింది.

Written By: Mahi, Updated On : October 25, 2024 12:36 pm

Wari Energies IPO Allotment

Follow us on

Wari Energies IPO Allotment: సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీదారు అయిన వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ కు మంచి డిమాండ్ లభించింది. ఐపీవో కోసం అత్యధిక దరఖాస్తులతో రికార్డులను సైతం తిరిగి రాసింది. బిడ్డింగ్ పీరియడ్ ముగిసింది. ఇప్పుడు దరఖాస్తుదారులు వారీ ఎనర్జీస్ ఐపీఓ కేటాయింపు కోసం చూస్తున్నారు. ఇది ఈ రోజు (అక్టోబర్ 25) ఖరారు అవుతుందని భావిస్తున్నారు. అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు సబ్ స్క్రిప్షన్ కోసం ఐపీఓ తెరిచిన తర్వాత కంపెనీ ఈ రోజు షేర్ల కేటాయింపు ప్రాతిపదికను నిర్ణయించనుంది. అక్టోబర్ 25న అర్హులైన దరఖాస్తుదారుల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లను జమ చేసి, అదే రోజు విఫలమైన బిడ్డర్లకు రీఫండ్స్ ప్రారంభించనుంది. ఇన్వెస్టర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్ సైట్ల ద్వారా.. ఐపీఓ రిజిస్ట్రార్ అధికారిక పోర్టల్ ద్వారా వారీ ఎనర్జీస్ ఐపీఓ కేటాయింపు స్థితిని ఆన్ లైన్ లో చూసుకోవచ్చు.

ఐపీవో కేటాయింపు స్థితిని ఇలా తెలుసుకోండి

బీఎస్ఈలో ఐపీఓ కేటాయింపు స్థితి
* బీఎస్ఈ వెబ్ సైట్ లింక్ ను సందర్శించండి.
* ఇష్యూ టైప్ లో ‘ఈక్విటీ’ని ఎంచుకోవాలి.
* ఇష్యూ పేరు డ్రాప్ డౌన్ మెనూలో ‘వారీ ఎనర్జీస్ లిమిటెడ్’ ఎంచుకోవాలి.
* అప్లికేషన్ నెం. ఎంటర్ చేయాలి లేదంటే పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ‘ఐయామ్ నాట్ రోబోట్’ టిక్ చేసి ‘సెర్చ్’ బటన్ నొక్కాలి.
మీ ఐపీవో కేటాయింపు స్థితి కనిపిస్తుంది.

లింక్ టైమ్ లో..
* ఈ లింక్ లో ఐపీవో రిజిస్ట్రార్ వెబ్ సైట్ https://linkintime.co.in/initial_offer/public-issues.html ను సందర్శించాలి.
* సెలెక్ట్ కంపెనీ డ్రాప్ డౌన్ మెనూలో ‘వారీ ఎనర్జీస్ లిమిటెడ్’ ఎంచుకోవాలి.
* పాన్, యాప్ నెంబరు, డీపీ ఐడీ లేదా ఖాతా నెంబరు మధ్య ఎంచుకోండి.
* ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం వివరాలను నమోదు చేయాలి.
* సెర్చ్ పై క్లిక్ చేయాలి.
మీ ఐపీవో కేటాయింపు స్థితి కనిపిస్తుంది.

వారీ ఎనర్జీస్ IPO GMP
గ్రే మార్కెట్ లో వారీ ఎనర్జీస్ షేర్లు అద్భుతమైన బుల్లిష్ ట్రెండ్ ను చూపిస్తున్నాయి. వారీ ఎనర్జీస్ ఐపీఓ జీఎంపీ లేదా గ్రే మార్కెట్ ప్రీమియం నేడు ఒక్కో షేరుకు రూ. 1,558గా ఉందని స్టాక్ మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. గ్రే మార్కెట్ లో వారీ ఎనర్జీస్ షేర్లు ఇష్యూ ధర కంటే రూ. 1,558 ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఐపీఓ జీఎంపీ షేరు ధర రూ. 1,503తో పోలిస్తే 104 శాతం ప్రీమియంతో రూ. 3,061 వద్ద ట్రేడ్ అవుతోంది.

వారీ ఎనర్జీస్ ఐపీఓ వివరాలు
సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీదారు వారీ ఎనర్జీస్ లిమిటెడ్ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 23 వరకు సబ్ స్క్రిప్షన్ కోసం తన ఐపీవోను తెరిచింది. కేటాయింపు తేదీ అక్టోబర్ 25, ఐపీఓ లిస్టింగ్ తేదీ అక్టోబర్ 28న ఉండే అవకాశం ఉంది. ఈక్విటీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయి.

ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరు ధరను రూ. 1,427 నుంచి రూ. 1,503గా నిర్ణయించారు. రూ. 3,600 కోట్ల విలువైన 2.4 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, రూ. 721.44 కోట్ల విలువైన 48 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)తో బుక్ బిల్ట్ ఇష్యూ ద్వారా రూ. 4,321.44 కోట్లు సమీకరించింది.

వారీ ఎనర్జీస్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ రావడంతో పాటు ఐపీఓ కోసం అత్యధిక దరఖాస్తులు రావడంతో రికార్డు సృష్టించింది. వారీ ఎనర్జీస్ ఐపీఓకు మొత్తం 76.34 రెట్లు సబ్ స్క్రైబ్ కాగా, ఆఫర్ లో 2.10 కోట్ల షేర్లకు గానూ 160.91 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. 2.41 లక్షల కోట్లకు పైగా సబ్ స్క్రిప్షన్లను ఆకర్షించింది.

రిటైల్ కేటగిరీలో 10.79 రేట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ) విభాగంలో 62.49 రెట్ల సబ్ స్క్రిప్షన్ లభించింది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) పోర్షన్ ను 208.63గా బుక్ చేశారు.

యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ సెక్యూరిటీస్ (ఇండియా), ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, ఐటీఐ క్యాపిటల్ సంస్థలు వారీ ఎనర్జీస్ ఐపీఓలో లీడ్ మేనేజర్లుగా ఉండగా, లింక్ ఇన్టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తుంది.