CM Chandrababu : ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారు ఎటువైపు మొగ్గుచూపితే వారిదే విజయం. వారి దన్ను లేనిదే ఏ పార్టీ విజయం సాధించిన దాఖలాలు లేవు. కానీ వారికి ఎంతవరకు రాజ్యాధికారం దక్కలేదు. ఆ సామాజిక వర్గానికి సీఎం పదవి లభించలేదు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చూసి కాపులు మురిసిపోతున్నారు. కూటమి ప్రభుత్వంతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు సామాజిక వర్గం పైఅన్ని రాజకీయ పార్టీలు దృష్టిపెడతాయి.అనేక రకాల హామీలు ఇస్తాయి.వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే అదే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.2004లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు కాపులు. ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు కాపులు. అయితే అప్పుడు త్రిముఖ పోటీ ఉండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో మాత్రం టిడిపి వైపు మొగ్గు చూపారు కాపులు. ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019లో వైసీపీ వైపు టర్న్ అయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు.
* ఏకపక్షంగా కాపుల మద్దతు
అయితే ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా కాపులు టిడిపి కూటమి వైపు వచ్చారు. పవన్ కూటమిలో భాగస్వామి కావడంతో మద్దతు ఇచ్చారు. కూటమి కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించడం వెనుక కాపులు ఉన్నారు. చంద్రబాబుతో కాపుల అభివృద్ధి సాధ్యమవుతుందని అంతా భావిస్తున్నారు.వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్లు తప్పించి అన్ని అమలయ్యాయి.నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లభించాయి. వారి విదేశీ చదువులకు సైతం చంద్రబాబు సర్కారు సాయం చేసింది. కాపులకు ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లను సైతం అమలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ రద్దయ్యాయి. ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు సైతం రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే జగన్ పై కాపులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. కూటమిని గెలిపించుకున్నారు.
* భారీగా నిధులు ఖర్చుకు నిర్ణయం
అయితే ఇప్పుడు కూటమిపై భారీ ఆశలు పెట్టుకున్నారు కాపులు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. రానున్న ఐదేళ్ల కాలంలో 15 వేల కోట్ల రూపాయల నిధులు కాపుల కోసం ఖర్చు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వైసీపీ రద్దు చేసిన కాపు సంక్షేమ పథకాలను పునరుద్ధరించునున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అందుకుగాను ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబుతోనే మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.