https://oktelugu.com/

అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ ఎలా తీసుకోవాలంటే..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బాల ఆధార్ ను తీసుకోవాలి. బ్లూ కలర్ లో వచ్చే ఈ ఆధార్ కార్డ్ వల్ల పిల్లలు కూడా సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులవుతారు. ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ తీసుకోకుండానే ఆధార్ కార్డులను మంజూరు చేస్తారు. Also Read: రైతులకు శుభవార్త.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 2, 2021 / 11:19 AM IST
    Follow us on

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బాల ఆధార్ ను తీసుకోవాలి. బ్లూ కలర్ లో వచ్చే ఈ ఆధార్ కార్డ్ వల్ల పిల్లలు కూడా సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులవుతారు. ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ తీసుకోకుండానే ఆధార్ కార్డులను మంజూరు చేస్తారు.

    Also Read: రైతులకు శుభవార్త.. ఈ పంట కిలో లక్ష రూపాయలు..?

    పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డులు పిల్లల తల్లి లేదా తండ్రి పేరుపై జారీ అవుతాయి. అయితే బాల ఆధార్ ను ఎప్పుడు తీసుకున్నా ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఈ కార్డును ఉపయోగించాలి. ఐదు సంవత్సరాల తరువాత పిల్లలను ఆధార్ కేంద్రానికి తీసుకొని వెళ్లి బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించని పక్షంలో ఆ ఆధార్ కార్డులు పని చేయవు.

    అయితే చిన్నపిల్లలకు ఆధార్ కార్డును తీసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. పిల్లలకు ఆధార్ తీసుకోవాలంటే పిల్లల బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ తో పాటు తల్లిదండ్రులు ఫింగర్ ప్రింట్స్ వేయడం ద్వారా బాల ఆధార్ ను సులభంగా పొందవచ్చు. సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి బాల ఆధార్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు పొడిగింపు..?

    బాల ఆధార్ కోసం ఆధార్ ఎన్ రోల్ మెంట్ చేసుకున్న రెండు వారాల తరువాత ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ఆధార్ ఉంటే మాత్రమే మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఆధార్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉంటే మంచిది.