దేశీయ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటనే సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సిలిండర్ కనెక్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండేన్ గ్యాస్ సిలిండర్లను పొందాలని భావించే వాళ్లు 8454955555 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా వినియోగదారులకు ఈ నిర్ణయంతో భారీగా ప్రయోజనం చేకూరనుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ కొరకు రోజుల పాటు ఎదురుచూడకుండా ఈ విధంగా గ్యాస్ కనెక్షన్ ను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత కంపెనీ సిబ్బంది వివరాలు కనుక్కుని కనెక్షన్ ను మంజూరు చేస్తారు. ఆధార్ కార్డ్, చిరునామా ధృవీకరణ పత్రం ఇవ్వడం ద్వారా గ్యాస్ కనెక్షన్ ను పొందవచ్చు.
వాట్సాప్ లో రిజిష్టర్ అయిన ఇండేన్ గ్యాస్ కస్టమర్లు రిఫిల్ అని టైప్ చేసి సెండ్ చేస్తే గ్యాస్ బుకింగ్ చేయడం కూడా సాధ్యమవుతుంది. తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టేవాళ్లకు చిరునామా ధ్రువీకరణపత్రం లేకుండానే గ్యాస్ కనెక్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ ను సరళతరం చేసే విధంగా కంపెనీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా కస్టమర్లకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. గ్రామీణ గ్యాస్ వినియోగదారులు సైతం సులువుగా ఈ విధానం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ ను తీసుకోవచ్చు.