Cibil Score Check: ప్రతీ వ్యక్తి ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు బ్యాంకుల ద్వారా సాగుతున్నాయి. ఈ బ్యాంకుల్లో ఆ వ్యక్తి చేసే ట్రాన్సాక్షన్ ఆధారంగా అతని ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఇలా కొన్ని బ్యాంకులు ఆయా వ్యక్తులు బ్యాంకులతో ఉన్న అనుబంధానికి ప్రతీక గా సిబిల్ స్కోర్ (Cibil Score) ను ప్రకటిస్తుంది. దీని ఆధారంగా ఆ వ్యక్తి ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది బాగుంటే తను ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నాడని, ఇది తక్కువగా ఉంటే ఏవో తప్పులు చేస్తున్నాడని బ్యాంకులు గుర్తిస్తాయి. రుణాలు, ఖాతాలు ఓపెన్ చేయడానికి తదితర ఆఫర్లు ఇవ్వడానికి సిబిల్ స్కోర్ ను ఆధారం చేసుకుంటాయి. అయితే ఒక్కోసారి మనం ఎలాంటి తప్పు చేయకున్నా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. మరి మనం దీనిని ఎలా గుర్తించాలి.
Cibil Score బాగుంటేనే బ్యాంకులతో మన అనుబంధం బాగున్నట్లు లెక్క. అందువల్ల ఇది ఎప్పుడు Good ఉండేలా చూసుకోవాలి. ఇందు కోసం ఎప్పటికప్పుడు మన Cibil Score ను చెక్ చేసుకోవాలి. బ్యాంకు వ్యవహారాలు నిత్యం నడిపేవారికి సిబిల్ స్కోర్ ‘బ్యాంక్ బజార్’ మెసేజ్ లు పంపిస్తూ ఉంటుంది. ఫోన్ నెంబర్ ఆధారంగా వాట్సాప్ లో మెసేజ్ కూడా పెడుతుంది. ఒకవేళ మెసేజ్ లు రాకపోతే గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి బ్యాంక్ బజార్ అని టైప్ చేసి అందులో ఫోన్ నెంబర్ ఇస్తే Cibil Score చూపిస్తుంది. ఒకవేళ ఇందులో కాకుండా ‘వన్స్ ’ స్కోర్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా చూడొచ్చు.
బ్యాంకులు ప్రతిరోజూ కోట్ల వ్యవహారాలు నడుపుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎన్నో మిస్టేక్స్ కావొచ్చు. ఇలా సిబిల్ స్కోర్ ఒకరికి బదులు మరొకరిది ఎంట్రీ కావొచ్చు. ఇది ఇలాగే ఉంటే ఖాతాదారునికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మానుకోవద్దు. అంతేకాకుండా ఒకవేళ మన Cibil Score స్కోరు తక్కువగా ఉంటే కారణం ఏంటి అని తెలుసుకోవాలి. ఆ మిస్టేక్ ను సరిచేసుకొని వెంటనే స్కోరు పెంచుకునేలా చేసుకోవాలి.
లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇతర ఆఫర్స్ Cibil Score ఆధారంగానే ఇస్తారు. చాలా మంది ఎన్నో మిస్టేక్ చేయవచ్చు. వీటి కారణంగా Cibil Score తగ్గుతూ ఉంటుంది. అయితే మనం ఈఎంఐలు లేదా ఇతర బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలు సక్రమంగా ఉంచుకోవడం వల్ల బ్యాంకులు ఖాతాదారులను ఆదరిస్తాయి. ఇదే సమయంలో సిబిల్ స్కోరు పెరిగేటట్లు చేస్తాయి. అందువల్ల Cibil Score ను ఎప్పుడు హైక్ ఉండేలా ప్రయత్నించండి.