Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో నచ్చలేదా.. ఏ విధంగా మార్చుకోవాలంటే?

Aadhaar Card: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ప్రజలకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలు ప్రభుత్వ పథకాల యొక్క ప్రయోజనాలను పొందాలని అనుకుంటే ఆధార్ కార్డ్ సహాయంతో పొందవచ్చు. బయోమెట్రిక్ క్యాప్చర్ తప్పుగా ఉన్నా బయోమెట్రిక్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా యూజర్లు అప్ డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డుపై పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్, బర్త్ డేట్ వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. […]

Written By: Navya, Updated On : December 10, 2021 1:24 pm
Follow us on

Aadhaar Card: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ప్రజలకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలు ప్రభుత్వ పథకాల యొక్క ప్రయోజనాలను పొందాలని అనుకుంటే ఆధార్ కార్డ్ సహాయంతో పొందవచ్చు. బయోమెట్రిక్ క్యాప్చర్ తప్పుగా ఉన్నా బయోమెట్రిక్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా యూజర్లు అప్ డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

Aadhaar Card

ఆధార్ కార్డుపై పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్, బర్త్ డేట్ వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. వీటితో పాటు ఫోటోను కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డులో ఫోటోను అప్ డేట్ చేసుకోవాలని అనుకుంటే మొదట యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను నమోదు చేసి ఆ తర్వాత దరఖాస్తును ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో అందించాలి.

Also Read: గ్యాస్ సిలిండర్ వాడేవాళ్లకు శుభవార్త.. కొత్త బుకింగ్ ఆప్షన్!

ఆధార్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన సమాచారం సరిగ్గా ఉందని భావిస్తే కొత్తగా ఫోటోను మళ్లీ తీసి అప్ డేట్ అయ్యేలా చేస్తారు. 100 రూపాయలతో పాటు జీఎస్టీని చెల్లించడం ద్వారా సులభంగా ఈ సర్వీసులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత అప్ డేట్ అభ్యర్థన(యూఆర్‌ఎన్)తో ఉన్న రశీదును సులభంగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఆధార్ అధికారిక వెబ్ సైట్ లో యూ.ఆర్.ఎన్ తో ఆధార్ అప్ డేట్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోవచ్చు. ఆధార్ కార్డుదారులు సెల్ఫ్ సర్వీస్ ద్వారా ఫోటోను మార్చుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి

Also Read: గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?