https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ మొదటి అడుగు పడింది

NTR: దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ గురించి చర్చ నడుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ స్థాయి యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ఇంతవరకు రాలేదంటూ అందరూ చెప్పుకుంటున్నారు. ఒకపక్క యాక్షన్ మరో పక్క ఎమోషన్స్ కలగలిపి రేసీ గా సాగిన ట్రైలర్ అద్భుతం చేసింది. ప్రేక్షకులకు రాజమౌళి కొత్త అనుభూతిని పంచారు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ పై నార్త్ ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటీ? ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి వాళ్ళు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2021 11:54 am
    Follow us on

    NTR: దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ గురించి చర్చ నడుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ స్థాయి యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ఇంతవరకు రాలేదంటూ అందరూ చెప్పుకుంటున్నారు. ఒకపక్క యాక్షన్ మరో పక్క ఎమోషన్స్ కలగలిపి రేసీ గా సాగిన ట్రైలర్ అద్భుతం చేసింది. ప్రేక్షకులకు రాజమౌళి కొత్త అనుభూతిని పంచారు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ పై నార్త్ ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటీ? ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే ఉత్కంఠ తెలుగు ప్రేక్షకులలో నెలకొంది.

    NTR

    NTR

    తుఫాన్ చిత్రం ద్వారా రామ్ చరణ్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. ఎన్టీఆర్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో మొదటిసారి నార్త్ ఇండియన్స్ ని పలకరించారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తో ఎన్టీఆర్ ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనే సందేహం మొదలైంది. ఈ ప్రాథమిక పరీక్షలో డిస్టింక్షన్ మార్కులు ఎన్టీఆర్ రాబట్టినట్లు అక్కడి మీడియా కథనాలు పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఎన్టీఆర్ నటన, పోరాటాలు నార్త్ ఆడియన్స్ కి తెగ నచ్చేశాయట.

    ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగ్స్ గురించి వారు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారట. హిందీతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. దీంతో ఎన్టీఆర్ డైలెక్ట్, యాక్సెంట్ హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా… అనే భయం వెంటాడుతుండగా.. ఆ విషయంలో ఆయనకు ఫుల్ మార్కులు వేశారట. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఫక్తు హిందీ హీరోలను తలపించిందన్న మాట వినిపిస్తుంది. మొదటి చిత్రంతోనే ఎన్టీఆర్ తన ఓన్ వాయిస్ తో మెప్పించడం గొప్ప విషయం.

    బాలీవుడ్ లో జెండా పాతాలి, పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ప్రణాళికలు వేస్తున్న ఎన్టీఆర్ మొదటి అడుగు అక్కడ పడిందని, ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తోనే అక్కడ ప్రేక్షకుల మనసు దోచేశాడని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా భారీ ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయమన్న మాట వినిపిస్తుంది.

    Also Read: Nithya Menen: త్రివిక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్.. ఎప్పుడు అలా చూస్తారంటూ..!

    ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా లెవెల్ లో యూనివర్సల్ సబ్జక్ట్స్ తో తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరొక చిత్రం ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారనే ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

    Also Read: NTR Mother: ఆ విషయంలో ఎన్టీఆర్ ను హెచ్చరించిన తల్లి.. అలాంటివి సినిమాలోనే జరుగుతాయంటూ!

    Tags