Tata Sierra 2025: ప్రస్తుత కాలంలో కారు కొనాలని అనుకునేవారు ఎక్కువగా SUV కోరుకుంటున్నారు. కంపెనీలు సైతం ఈ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే గతంలో కొన్ని SUV కార్లు అలరించేవి. కానీ కొన్ని కారణాలవల్ల వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు అవి మార్కెట్ లోకి వస్తే బాగుండు అని కొందరు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అలాంటి వినియోగదారులకు టాటా కంపెనీ శుభవార్త తెలిపింది. గతంలో అలరించి ఆ తర్వాత కనుమరుగైపోయిన ఓ SUV ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తో మార్కెట్లోకి రాబోతుంది. సరసమైన ధరతోపాటు.. ఆకట్టుకుని ఇంజన్ కలిగి ఉన్న ఈ మోడల్ మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది అంటే?
దేశంలో Tata కంపెనీ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. దీని నుంచి 1991లో మార్కెట్లోకి వచ్చిన Sierra ఆ కాలంలో కార్ల వినియోగదారుల మనసు దోచుకున్నది. ఈ మోడల్కు అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ కొన్ని కారణాలవల్ల 2003లో ఇది కనుమరుగైపోయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి రాబోతుంది. అందరూ అనుకున్నట్లుగానే SUV వేరే ఇంట్లో రాబోతున్న ఈ కారు గురించి నవంబర్ 25న అధికారికంగా ప్రకటన చేశారు. ఈ కారులో మూడు శక్తివంతమైన ఇంజన్లను అమర్చారు. వీటిలో ఒకటి 1.5 లీటర్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్, వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్లలో మొదటిది 106 బిహెచ్పి పవర్ తో పాటు 145 ఎన్ఎం టార్గను రిలీజ్ చేస్తుంది. రెండో ఇంజన్ 160 బిహెచ్పి హార్స్ పవర్, 255 nm పీక్ పార్కును రిలీజ్ చేస్తుంది. మూడో ఇంజన్ 118 బిహెచ్పి పవర్ తో పాటు 260ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది.
ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ వెహికల్ మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి మోడల్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. డిసెంబర్ 16న బుకింగ్ ప్రారంభమైన దీనిని జనవరి 15 నుంచి డెలివరీ చేయనున్నారు. అయితే ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలంటే రూ.21,000 చెల్లించాల్సి ఉంటుంది. టాటా సియర్రా ధర రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియెంట్ రూ.21.29 లక్షల వరకు ఉంది. ధరకు అనుగుణంగా ఫీచర్లు, ఇంజన్ ను అందిస్తారు. ఎస్ యు వి కారు కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.