https://oktelugu.com/

రోజుకు రూ.35తో 37 లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అంటే..?

తక్కువ సమయంలో లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే తక్కువ సమయంలో లక్షాధికారులు, కోటీశ్వరులు కావడం సాధ్యమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ, సహనం ఉంటే మాత్రమే డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మాత్రమే కోటీశ్వరులు కావడం సాధ్యమవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 7, 2021 / 09:26 PM IST
    Follow us on

    తక్కువ సమయంలో లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే తక్కువ సమయంలో లక్షాధికారులు, కోటీశ్వరులు కావడం సాధ్యమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ, సహనం ఉంటే మాత్రమే డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.

    దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మాత్రమే కోటీశ్వరులు కావడం సాధ్యమవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం డబ్బులు పెడితే 12 శాతం వరకు రాబడిని పొందే అవకాశం ఉంటుంది. . సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ ‌లో ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి నెలా 1,050 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 37 లక్షల కంటే ఎక్కువ మొత్తం లభిస్తాయి.

    రోజుకు కేవలం 35 రూపాయలు ఆదా చేయడం ద్వారా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేసి కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ లాభాలను పొందడం సాధ్యం కాదు. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రాబడి పొందడంతో పాటు సులభంగా మిలియనీర్ కావచ్చు. ఈ విధంగా సులభంగా డబ్బు సంపాదించవచ్చు.

    ఆర్థిక నిపుణులను సంప్రదించడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా తక్కువ మొత్తంతో ఎక్కువ రాబడి పొందవచ్చు.