Homeబిజినెస్Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.....

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ ‘ఎక్స్ సిరీస్’లో భాగంగా ‘హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లే, మరియు అత్యాధునిక డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్/మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె.. ఈ ఫోన్‌లో 6.87 అంగుళాల HD ప్లస్ TFT […]

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ ‘ఎక్స్ సిరీస్’లో భాగంగా ‘హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లే, మరియు అత్యాధునిక డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్/మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

ఈ ఫోన్‌లో 6.87 అంగుళాల HD ప్లస్ TFT LCD డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1,020 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో సుదీర్ఘకాలం ఫోన్ ఉపయోగించేటప్పుడు కళ్లకు అలసట కలగకుండా డైనమిక్ డిమ్మింగ్ ఐ కామ్‌ఫర్ట్ టెక్నాలజీని ఇందులో చేర్చారు. అంతేకాకుండా, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP69K రేటింగ్స్ ను ఇచ్చారు. హానర్ ఎక్స్7ఈ ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. యాప్‌లు, షార్ట్‌కట్‌లు, AI ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన వన్-టాప్ AI బటన్ అందించారు.

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం.. ఈ ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తో పాటు ఒక సెకండరీ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ స్నాపర్ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ ఇందులో 8,100mAh భారీ బ్యాటరీ . రోజువారీ భారీ వినియోగానికి కూడా ఇది నిరంతర బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 6GB RAM ప్లస్ 128GB స్టోరేజ్ కలిగిన QAR 999 (భారత కరెన్సీలో సుమారు రూ.26,000) తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper