Homeబిజినెస్Honor Magic V6: ఈ ఫోన్ డిస్ప్లే వేరే లెవెల్.. కెమెరా గురించి తెలిస్తే షాక్...

Honor Magic V6: ఈ ఫోన్ డిస్ప్లే వేరే లెవెల్.. కెమెరా గురించి తెలిస్తే షాక్ అవుతారు.. ఇంతకీ ఈ ఫోన్ ఏదంటే?

Honor Magic V6: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వచ్చినా కూడా కొందరు లగ్జరీ వాటి కోసం ఎదురు చూస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ప్రీమియం లుక్ తో ఉండే డిజైన్ ను ఏర్పరిచి, బ్యాటరీ, డిస్ప్లే విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ వంటి సాఫ్ట్వేర్ ను చేర్చి యూత్ తో పాటు అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉండేవిధంగా తయారు చేస్తారు. ఇలాంటి మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడంలో Honor కంపెనీ ముందు ఉంటుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ఫోల్డబుల్ మొబైల్ ను ఆవిష్కరించింది. ఇందులో కెమెరా, డిస్ప్లే వేరే లెవెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Honor కంపెనీ నుంచి లేటెస్ట్గా మార్కెట్లోకి Magic V6 అనే మొబైల్ వచ్చింది. ఇందులో 6.52 అంగుళాల కవర్ డిస్ప్లే, 7.95 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే ఉండడంతో యూత్ ను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అలాగే మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అనుగుణంగా ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 6,000 nits బ్రైట్నెస్ ఉండడంతో ఎలాంటి వాతావరణంలో నైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. ఈ డిస్ప్లే పై ఆల్ట్రా థిన్ ఫ్లెక్సిబుల్ క్లాసును అమర్చారు. ఇది మినిమైజ్డ్ సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఇప్పటివరకు ఉన్న మ్యాజిక్ V5 తో పోలిస్తే ఇందులో డిస్ప్లే మరింత బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది.

Also Read: Samsung Galaxy S25 పై భారీ తగ్గింపు.. ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొంటారు..

కొత్తగా మార్కెట్లోకి వచ్చి మ్యాజిక్ v6 మొబైల్ లో 8 ఎలైట్ జెన్ 5 SoC సాఫ్ట్వేర్ నువ్వు కలిగి ఉంది. అలాగే ఇందులో 16 జిబి రామ్, 512 GB స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫైల్స్ ను లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి పని రకాల యాప్స్ ఉపయోగించినా కూడా ఫోన్ వేగం తగ్గకుండా ఉంటుంది. అలాగే ఇందులో AI ఫీచర్స్ కూడా ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ను అమర్చారు.64 MP పెరిస్కోప్ టెలిఫోటో ఉండనుంది.50 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా పనిచేయనుంది.20 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ సైతం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 6,000 mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 80 W వైర్డ్ చార్జింగ్ తో పాటు 66 W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఈ బ్యాటరీ 25 శాతం సిలికాన్ కంటెంట్ తో ఉండడంతో ఎక్కువసేపు వాడేందుకు అనుగుణంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular