Honda upcoming hybrid and electric cars: ఆటోమోబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్న Honda కంపెనీ ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించే విధంగా ఎన్నో రకాల కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త వాహనాలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే నాలుగేళ్లలో 10 కొత్త కారులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించడం విశేషం. అంతేకాకుండా రాబోయే 12 నుంచి 15 నెలల్లో హైబ్రిడ్ తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా రోడ్లపైకి రానున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాబోతున్న హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల గురించి తెలుసుకుందాం..
Honda Prelude Hybrid:
వచ్చే మూడు నెలల్లో ఈ కంపెనీ ప్రీల్యూడ్ హైబ్రిడ్ కారు రాబోతుంది. ఇందులో జపాన్ దేశానికి చెందిన E 20 వాహనంలో ఉండే ఇంధనం ఉండబోతుంది. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 197 Bhp పవర్ అందిస్తుంది. సిమిలేటెడ్ గేర్ షిఫ్టుల ద్వారా ఫ్రంట్ వీల్స్ కు పవర్ ట్రాన్స్మిట్ చేయబడుతుంది. ఈ కారు భారతదేశం లోకి వస్తే ధర రూ. 80 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Honda ZR – V hybrid:
ఈ కొత్త కారు హోండా కంపెనీ యొక్క రెండవ కొత్త మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ సెటప్ లో కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టంతో పనిచేస్తుంది. ఈ ఇంజన్ వన్ 177 bhp పవర్ ను అందిస్తుంది. 2026 చివరికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీని ధర రూ.50 నుంచి రూ.55 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
All Electrc Honda 0 Alpha SUV:
హోండా కంపెనీకి చెందిన 0 ఎలక్ట్రిక్ ఎస్ యు వి భారత దేశంలో బ్రాండ్ యొక్క ఆల్ఫాలో దీని తయారు చేయబడింది. ఇది 2027 ఏడాదిలో వచ్చే అవకాశం ఉంది. హోండా కంపెనీ భారత దేశంలో స్థానికంగా అభివృద్ధి చేసిన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ యు వి కారు. ఇందులో 60 నుంచి 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. దీని ఒకసారి చార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ కారులో పనోరమిక్ సన్ రూఫ్, లెవెల్ 2 ADAS వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇది మార్కెట్లోకి వస్తే రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది.