Honda SP 125 price: రోజువారి ప్రయాణికులతో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారు మంచి ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే ఎక్కువ రోజులు మన్నికతో ఉంటూ.. ఇంజన్ విషయంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే Honda బైక్స్ కొనాలని చాలామంది అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ బైక్స్ స్టైలిష్ డిజైన్తో ఉండడంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. Honda కంపెనీ రోజువారి వినియోగదారులతో పాటు యూత్ ను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి కొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బైక్ ధర కూడా అందుబాటులో ఉండడంతో పాటు మైలేజ్ విషయంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు సపోర్ట్ గా ఉంటుంది. ఈ బైక్ పూర్తి వివరాలు కి వెళ్తే..
Honda కంపెనీకి చెందిన కొత్త బైక్ SP 125 ఈ ఏడాది ఆకర్షణీయమైన బైక్ గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీని డిజైన్ చూడగానే ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఈ బైకు ఉండే LED హెడ్ లాంప్స్ కొత్తగా కనిపిస్తాయి. స్టైలిష్ గా ఉండే గ్రాఫిక్స్.. అల్లాయ్ వీల్స్ ప్రీమియం లుక్ ను తీసుకొస్తాయి. స్పోర్ట్స్ బైక్ వలె సైరన్ బ్లూ కలర్ లో ఉండడంతో యువత ఇంప్రెస్ అవుతున్నారు. ఇందులో ఉండే ఇంజన్ పవర్ ఉద్యోగులతో పాటు వ్యాపారులకు అనుగుణంగా ఉండనుంది. ఈ బైక్ లో 123.94 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది BS6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 10.7 బిహెచ్పి పవర్, 10.9 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. దీంతో నగరాల్లో ప్రయాణం చేసే వారికి సున్నితమైన డ్రైవింగ్ అనుభూతి కలుగుతుంది. బైక్ లో ఉండే ఇంజన్ ఎలాంటి సౌండింగ్ లేకుండా స్మూత్ గా ప్రయాణం చేసేలా ఉంటుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 11 లీటర్ల ఫ్యూయల్ సామర్థ్యం ఉన్న ఈ బైక్ తో దూర ప్రయాణాలు చేయవచ్చు.
ఎక్స్టీరియర్ డిజైన్ తో పాటు ఈ బైక్ లో స్మార్ట్ ఫీచర్స్ ప్రత్యేకంగా ఉండనున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ తో కలిగిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. ఇందులో వేగం, ఇంధన సామర్థ్యం, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్ వంటి వివరాలు కనిపిస్తాయి. సేఫ్టీ కోసం బైక్ లో ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, సైడ్ స్టాండ్ రిమైండర్ వంటివి అలర్ట్ చేస్తాయి. అలాగే కంప్లైంట్ బ్రేకింగ్ సిస్టం తో పాటు హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్లు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనిని ప్రస్తుతం రూ.85,000 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే వేరియంట్ ను బట్టి ధర మారుతుంది.
