Homeబిజినెస్Honda Shine 125: రైడర్స్ కు కొత్త అనుభూతి ఇచ్చే ఈ బైక్ గురించి తెలుసా?

Honda Shine 125: రైడర్స్ కు కొత్త అనుభూతి ఇచ్చే ఈ బైక్ గురించి తెలుసా?

Honda Shine 125: రోజువారి అవసరాల కోసం కొన్ని రకాల ద్విచక్ర వాహనాలు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. వీటిలో Honda కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చే Shine గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే Hero Honda కలయిక లో వచ్చిన ఈ బైక్ ఎంతో ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు హోండా ప్రత్యేకంగా విడిపోయినా కూడా ఆకర్షణీయమైన బైక్స్ తీసుకురావడంతో వీటికి ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటివరకు వచ్చిన షైన్ బైక్ కంటే కొత్తగా వచ్చే వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన Shine 125 బైక్ కు సంబంధించిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే కొత్త వాహనంలో అనేక మార్పులు చూసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దీని డిజైన్ కూడా పూర్తిగా మార్చి వేయడంతో యూత్ ఎక్కువగా దీనిని చూసి ఇంప్రెస్ అవుతున్నారు. మరోవైపు మైలేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రోజువారి వినియోగదారులకు ఇది సపోర్ట్ గా ఇవ్వనుంది. మరి కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న ఈ షైన్ ఎలా ఉందో చూద్దాం.

ఆన్లైన్లో హోండా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా మార్కెట్లోకి వచ్చే Honda Shine Limited Edition అనే బైక్ 123.94 సీసీ ఇంజన్ తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఇంజన్ 10.63 బిహెచ్పి పవర్, 11 nm టార్క్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇది 50 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లను అమర్చారు. ముఖ్యంగా ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్ వంటివి యూత్ ను ఆకర్షిస్తాయి. అలాగే ఎక్స్టీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 18 అంగుళాల బ్రౌన్ అల్లాయ్ వీల్స్, 10.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉండడంతో సుదూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సైలెంట్ స్టార్ సిస్టం, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటివి రైడర్లకు సౌకర్యాన్ని ఇస్తాయి.

సీటింగ్ సామర్థ్యం అనుకూలంగా ఉండడంతో దూర ప్రయాణాలు చేసినా కూడా ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది. అలాగే ఈ బైక్ పై ఉండే డిజైన్ యూత్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది. దీనిపై రైడ్ చేస్తే ప్రత్యేక లుక్ లో ఉంటారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.85,000 ప్రారంభ ధర నుంచి విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన వాటికంటే ఈ బైక్ లో ఉండే ఫీచర్లు అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండడంతో రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటాయని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version