Honda Shine 125 CC: భారతదేశంలో Honda కంపెనీకి చెందిన బైక్స్ కు ప్రత్యేక ఆదరణ ఉంది. గతంలో హీరో హోండా తో కలిపిన బైక్స్ మార్కెట్లోకి రావడంతో ఎక్కువమంది కొనుగోలు చేసేవారు. అయితే హీరో నుంచి విడిపోయినప్పటికీ హోండా కంపెనీకి చెందిన బైక్స్ పై ఎక్కువ మక్కువ పెంచుకుంటున్నారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ సైతం ఆకర్షణీయమైన బైక్స్ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కంపెనీ 125 CC ఇంజన్ తో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఆకర్షణీయంగా ఉండడంతోపాటు రోజువారి ప్రయాణికులకు అనుగుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా లీటర్ ఇంధనానికి 85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ అతి తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉంది. మరి ఈ బైక్ లో ఉండే ప్రత్యేకత లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Honda company నుంచి Shine 125 CC ఎక్స్టీరియర్ డిజైన్ ప్రీమియం లుక్ ను అందిస్తోంది. ఇది మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంకులు కలిగి ఉంది. అలాగే స్టైలిష్ గా ఉండే గ్రాఫిక్స్, అలా ఈ వీల్స్, బాడీ ఫినిషింగ్ మొత్తం అద్భుతం అని అనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన షైన్ వాహనాల కంటే దీని డిజైన్ మరింత అందాన్ని పొందింది. అంతేకాకుండా స్పోర్ట్స్ బైక్ వలె ఉండి యూత్ కు బాగా నచ్చుతుంది.
ఈ బైక్ లో 125 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉండడంతో స్థిరమైన వేగాన్ని అందిస్తుంది. ఎలాంటి వైబ్రేషన్ లేకుండా లాంగ్ జర్నీలో స్మూత్ డ్రైవింగ్ ఇస్తుంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తూ హైవేలపై ఎలాంటి అలజడి లేకుండా ప్రయాణం ఉంటుంది. ఈ ఇంజన్ లీడర్ ఇంధనానికి 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రోజువారి వినియోగదారులకు.. లాంగ్ జర్నీ చేసే వారికి మైలేజ్ విషయంలో ఫుల్ సపోర్ట్ ఉండనుంది. అలాగే దీని సీటింగ్ వెడల్పుగా ఉండడంతో పాటు నిటారుగా ఉండే హ్యాండిల్స్ ఉండడంతో లాంగ్ జర్నీ చేసేవారు ఎలాంటి అలసట లేకుండా ఉండగలుగుతారు. కఠిన రోడ్లపై కూడా స్మూత్ గా డ్రైవింగ్ వెళ్లే విధంగా దీనికి టైర్లను సెట్ చేశారు.
ఈ కొత్త షైన్ బైక్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన టీచర్లను అమర్చారు. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఇంజన్ స్టార్ట్, స్టాప్ సిస్టం, మెరుగైన స్మార్ట్ పవర్ టెక్నాలజీ వంటి లక్షణాలు సౌకర్యవంతంగా ఉంటాయి. సేఫ్టీ కోసం ఇందులో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటివి ఉన్నాయి. ఇలా లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు.. అద్భుతమైన ఇంజన్ పనితీరు ఉన్న హోండా షైన్ బైక్ ను రూ.62,599 తో విక్రయించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మధ్యతరగతి వారికి ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్మార్ట్ లుక్ తో ఉండడంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.