Honda : దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో సరికొత్త టెక్నాలజీతో హోండా సెన్సేషన్ సృష్టించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేటెడ్ 2025 CB650R, CBR650R మోడళ్లను విడుదల చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ బైక్‌లు భారతదేశంలో ఈ-క్లచ్ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి వాహనాలుగా నిలుస్తున్నాయి. ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన బైక్‌ల ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం.
హోండా తన మోస్ట్-అవటెడ్ అప్‌డేటెడ్ 2025 CB650R, CBR650Rలను రిలీజ్ చేసింది. ఇది భారతదేశంలో ఈ-క్లచ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి మోటార్‌సైకిల్‌గా నిలిచింది. ఈ బైక్ కోసం బుకింగ్‌లు హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద, ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. బైక్ డెలివరీలు మే 2025 చివరి నాటికి ప్రారంభమవుతాయి. మార్కెట్‌లో 2025 హోండా CB650R ఎక్స్-షోరూమ్ ధర రూ.9.60 లక్షలు కాగా, ఫెయిర్డ్ CBR650R ధర రూ.10.40 లక్షలుగా ఉంది.
Also Read : నంబర్ వన్ అయినా నష్టాల్లోనే.. హోండాకు ఎదురు దెబ్బ!
పవర్‌ఫుల్ ఇంజన్‌తో బైక్
2025 CB650R ఎక్స్‌టీరియర్‌ను పరిశీలిస్తే.. ఇది హోండా నియో స్పోర్ట్స్ కేఫ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో స్కల్ప్టెడ్ ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్, ఎక్స్‌పోజ్డ్ స్టీల్ ఫ్రేమ్ ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే బైక్‌లో 649cc ఇన్-లైన్ 4-సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది 70bhp పవర్, 63Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను ఈ-క్లచ్ సిస్టమ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
అద్భుతమైన ఫీచర్లు
ఫీచర్ల పరంగా ఈ బైక్‌లో రోడ్‌సింక్ కనెక్టివిటీతో 5.0-అంగుళాల TFT డిస్‌ప్లే అందించబడింది. ఇక 2025 CBR650R విషయానికి వస్తే ఇది ఫుల్-ఫెయిర్డ్ లుక్, ఏరోడైనమిక్ స్టైలింగ్‌తో మరింత రేసీ డిజైన్‌ను కలిగి ఉంది. CBR650R గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉంది. CB650R క్యాండీ క్రోమోస్పియర్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.
