Honda: భారతదేశ టూ వీలర్ మార్కెట్‌లో సరికొత్త టెక్నాలజీతో రెండు పవర్ ఫుల్ బైక్స్ రిలీజ్ అయ్యాయి. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) 2025 CB650R, CBR650R మిడిల్‌వెయిట్ పెర్ఫార్మెన్స్ బైక్స్‌ను దేశంలో విడుదల చేసింది. ఈ రెండు బైక్‌లు ప్రత్యేకమైన ఈ-క్లచ్ టెక్నాలజీతో వస్తున్నాయి. దీని ద్వారా రైడర్‌లు క్లచ్ నొక్కకుండానే గేర్‌లను మార్చుకోవచ్చు. ఇంతకుముందెన్నడూ చూడని ఈ టెక్నాలజీ భారతీయ మార్కెట్‌కు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఈ బైక్‌ల ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.
Also Read: యుద్ధాన్ని ఆపడానికి వెళ్తుంటే.. నిలిపేశారు.. ముంబై విమానాశ్రయంలో పాల్ ఉగ్రరూపం.. వైరల్ వీడియో
2025 హోండా CB650R ధర రూ.9.60 లక్షలు కాగా, 2025 హోండా CBR650R ధర రూ.10.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు మోటార్‌సైకిళ్ల కోసం హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు షురూ అయ్యాయి.
హోండా కొత్త ఈ-క్లచ్ సిస్టమ్ ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టారు. దీనిని మొదట నవంబర్ 2023లో ఆవిష్కరించారు. ఈ సిస్టమ్ రైడర్‌కు క్లచ్ లివర్‌ను ఆపరేట్ చేయకుండానే సులభంగా గేర్‌లను మార్చే సౌకర్యాన్ని అందజేస్తుంది. కొత్త ఈ-క్లచ్ ఇప్పటికే అనేక గ్లోబల్ బైక్‌లలో అందుబాటులో ఉంది. చివరకు ఇప్పుడు ఇది భారతీయ మార్కెట్‌లోకి కూడా వస్తోంది. ఈ టెక్నాలజీలో మల్టీ-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ క్లచ్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. క్లచ్ లివర్‌ను నొక్కకుండానే గేర్ మార్చవచ్చు. అంతేకాకుండా స్టార్ట్ లేదా స్టాప్ చేసేటప్పుడు కూడా క్లచ్ నొక్కాల్సిన అవసరం లేదు. అయితే, ఈ రెండు బైక్స్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ-క్లచ్ అంటే ఏమిటి?
ఈ-క్లచ్‌లో క్విక్‌షిఫ్టర్, రెగ్యులర్ మాన్యువల్ క్లచ్, హోండా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) వంటి ఫీచర్స్ కలిసి ఉంటాయి. ఇది రైడింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. సాధారణ మోటార్‌సైకిల్‌లో ఉన్నట్లుగానే మాన్యువల్ కంట్రోల్ కోసం క్లచ్ లివర్, షిఫ్టర్ కూడా ఇందులో ఉంటాయి. ఈ-క్లచ్ కారణంగా మోటార్‌సైకిళ్ల బరువు దాదాపు 2.8 కిలోల వరకు పెరుగుతుంది.
2025 హోండా CBR650R
2025 హోండా CBR650R ట్విన్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో ఫుల్-ఫెయిరింగ్‌ను కలిగి ఉంటుంది. దీని స్టైలింగ్ లీటర్-క్లాస్ ఫైర్‌బ్లేడ్ వలె స్పోర్టీగా ఉంటుంది. ఇది గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు కలర్స్ లో అందుబాటులో ఉంది. CBR650Rలో 649సీసీ ఇంజన్ ఉంది. మెరుగైన కంట్రోల్ కోసం బైక్‌లో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) లేదా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చింది. సస్పెన్షన్ సెటప్,బ్రేక్‌లతో సహా ఇతర హార్డ్‌వేర్ కూడా CBR650R వలెనే ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌తో పోలిస్తే ఈ-క్లచ్‌తో కూడిన 2025 హోండా CBR650R దాదాపు రూ.40,000 ఎక్కువ ఖరీదుగా ఉంటుంది.
2025 హోండా CB650R
2025 హోండా CB650R మినిమలిస్ట్ లుక్, మస్క్యులర్ స్టైలింగ్‌తో నియో-రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. బైక్‌లో గుండ్రని LED హెడ్‌ల్యాంప్, స్కల్ప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఎక్స్‌పోజ్డ్ స్టీల్ ఫ్రేమ్ ఉన్నాయి. ఈ బైక్ క్యాండీ క్రోమోస్పియర్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. 649సీసీ ఇంజన్‌తో 94 bhp పవర్, 63 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో బ్లూటూత్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు, నావిగేషన్‌ను అందించే 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. ఈ-క్లచ్ కలిగిన 2025 హోండా CB650R స్టాండర్డ్ వెర్షన్ కంటే దాదాపు రూ.40,000 ఎక్కువ ధర కలిగి ఉంది.