Honda Amaze vs Tata Tigor:భారత మార్కెట్‌లో అనేక అద్భుతమైన సబ్ కాంపాక్ట్ సెడాన్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లు అద్భుతమైన ఫీచర్లతో లభిస్తాయి. హోండా కంపెనీ డిసెంబర్ 2024లో అమేజ్ అప్‌గ్రేడ్ మోడల్‌ను విడుదల చేసింది. అయితే టాటా జనవరి 2025లో టిగోర్ అప్‌గ్రేడ్ మోడల్‌ను ప్రారంభించింది. ఏ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు కార్ల ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
Also Read : మారుతి ఫ్రాంక్స్ vs టాటా పంచ్.. మైలేజ్ ఎవరిది? సేఫ్టీ ఎవరికి ?
అమేజ్, టిగోర్ ఫీచర్లు:
టాటా టిగోర్‌లో ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్,HD రివర్స్ పార్కింగ్ డిజిటల్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, రియర్ డీఫాగర్, చైల్డ్ సీట్ కోసం ISOFIX సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హోండా అమేజ్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS) ఫీచర్ ఉంది. దీనితో పాటు లేన్‌వాచ్ కెమెరా, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్, ఆటో హై బీమ్, లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వంటి అనేక అత్యాధునిక ఫీచర్లు లభిస్తాయి.
ఇంజిన్ వివరాలు
టాటా టిగోర్‌లో 1199సీసీ పెట్రోల్, బై-ఫ్యూయల్ ఇంజన్ ఉంది. ఇది పెట్రోల్‌పై 85 bhpపవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, CNGపై 72 bhp పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, హోండా అమేజ్‌లో కూడా టిగోర్ లాగానే 1199సీసీ ఇంజన్ ఉంది, ఇది 89 bhp పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
తక్కువ ఫ్యూయెల్ తో ఎక్కువ దూరం ప్రయాణించే కారును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి హోండా, టాటా కార్లలో ఏది మంచి మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. హోండా అమేజ్ మాన్యువల్ (పెట్రోల్) వేరియంట్ లీటరుకు 19.28 కిలోమీటర్లు, ఆటోమేటిక్ (పెట్రోల్) వేరియంట్ లీటరుకు 19.6 కిలోమీటర్లు, మాన్యువల్ (CNG) వేరియంట్ కిలోకు 26.49 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. టాటా టిగోర్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 19.2 కిమీ మైలేజ్ ఇస్తుంది. అయితే, CNG వేరియంట్ లీటరుకు 28.06 కిమీ మైలేజ్ ఇస్తుంది.
ధర ఎంత?
హోండా ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ ధర రూ. 8 లక్షల 09 వేల 900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు టాప్ వేరియంట్‌ను రూ. 11 లక్షల 19 వేల 900 (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. టాటా కంపెనీ కారు బేస్ వేరియంట్ రూ. 5 లక్షల 99 వేల 990 (ఎక్స్-షోరూమ్) కు లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ. 9 లక్షల 44 వేల 990 (ఎక్స్-షోరూమ్).
Also Read : ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 650కి.మీ.. కియా నుంచి నయా ఎలక్ట్రిక్ కార్