Honda Activa 7G: ద్విచక్ర వాహనాల తయారీలో హోండా(Honda) ఇండియన్ మార్కెట్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. గతంలో హీరోతో కలిసి పనిచేసిన ఈ సంస్థ.. కొంతకాలంగా సొంతంగానే ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. బైక్ తో పాటుగా స్కూటీలను కూడా తయారు చేస్తూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
2026 లో హోండా కంపెనీ యాక్టివా 7జి (Activa 7G) అనే మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కూటర్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం హోండా కంపెనీ ఈ మోడల్ లో అనేక రకాల సదుపాయాలను, ఆధునిక సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
డిజైన్ విషయంలో హోండా కంపెనీ ఈ తరానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిందని చెప్పాలి. క్లీన్ బాడీ ప్యానెల్, న్యూట్రల్ స్టైలింగ్, ఎల్ఈడి లైటింగ్ వంటివి సరికొత్తగా కనిపిస్తున్నాయి.
ఈ మోడల్ కు హోండా కంపెనీ ఇంజన్ విషయంలో ఆటోమేటిక్ సివిటీ ట్రాన్స్ మిషన్ ను తీసుకొచ్చింది. దీనివల్ల ట్రాఫిక్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైడింగ్ అనుభూతి పొందవచ్చు. ఇంజన్ ఇంధన సామర్థ్యాన్ని పెంచే క్రమంలో ఈవెనింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఇంజన్, డిజైన్ విషయంలోనే కాకుండా డిజిటల్ పరికరాలను జత చేయడంలో కూడా నవీన తత్వాన్ని హోండా కంపెనీ తెరపైకి తీసుకువచ్చింది. ఇంజన్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, యుఎస్బి చార్జింగ్ సపోర్ట్ ను 7 జి మోడల్ కు జత చేసింది.
హోండా యాక్టివా 7 జీ లో పొడవైన రైడర్ సీటు, వెనకాల కూర్చునే వ్యక్తికి కంఫర్ట్ కూషనింగ్, సస్పెన్షన్ ట్యూనింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టీరింగ్ తేలికపాటిగా ఉండడంతో ఎవరైనా రైడ్ చేయడానికి అవకాశం ఉంది.
మొత్తంగా ఈ మోడల్ లో హోండా కంపెనీ స్మార్ట్ డిజైన్ మీద దృష్టి సారించింది. మైలేజ్ మెరుగ్గా లభించడానికి అనేక మార్పులు చేసింది. రోజువారీ రైడ్ చేసేవారికి ఉపయుక్తంగా స్టీరింగ్ నుంచి మొదలు పెడితే సీట్ కూషనింగ్ వరకు ఆధునిక మార్పులను తీసుకొచ్చింది. అందువల్లే ఈ మోడల్ తమ విశ్వసనీయమైన బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంటుందని హోండా కంపెనీ భావిస్తోంది.
సంక్రాంతి వేడుకల్లో మరోసారి డాన్స్ అదరగొట్టిన మాజీ మంత్రి, @YSRCParty నేత @AmbatiRambabu#Bhogi2026 pic.twitter.com/I2C5QkoI74
— greatandhra (@greatandhranews) January 14, 2026