Bhogi 2026 Ambati Rambabu Dance: అంబటి రాంబాబు మరోసారి వైరల్ అయ్యారు. గతం మాదిరిగా సంక్రాంతి సంబరాల్లో డాన్స్ వేశారు. గుంటూరులో వైయస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. గతం మాదిరిగానే అంబటి రాంబాబు హుషారైన పాటలకు డాన్స్ చేస్తూ అలరించారు. సంబరాల రాంబాబు అనే పేరు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని.. తనపై గేలిచేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున ఆయన భోగి వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులు వేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోలను భోగిమంటల్లో వేశారు.
* గత అనుభవాల నేపథ్యంలో..
అయితే గత అనుభవాల దృష్ట్యా అంబటి రాంబాబు ఈసారి డాన్స్ వేయరని అంతా భావించారు. కానీ ఒకేసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాటలకు డ్యాన్సులతో అలరించారు అంబటి రాంబాబు. ఆయనతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా డ్యాన్సులు వేయడం కనిపించింది. హుషారైన పాటలతో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు మరింతగా డాన్స్ వేసేందుకు ముందుకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో.. మంత్రి హోదాలో సత్తెనపల్లి లో జరిగే వేడుకల్లో పాల్గొనేవారు అంబటి రాంబాబు. అప్పట్లో రాంబాబు పై సెటైర్లు పడేవి. పవన్ కళ్యాణ్ సంబరాల రాంబాబు అనే పేరు కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో అంబటి రాంబాబును అనుకరిస్తూ ఒక పాత్రను కూడా పెట్టారు. అప్పటినుంచి సంబరాల రాంబాబు గా ఫేమస్ అయ్యారు అంబటి రాంబాబు.
* పవన్ వల్లే తనకీ పేరు..
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అంబటి రాంబాబు. గతంలో విమర్శలు రావడంతో ఈసారి ఆయన డాన్సుల జోలికి పోరని అంతా భావించారు. కానీ అంబటి రాంబాబు వెనక్కి తగ్గలేదు. డాన్సులతో అలరించారు. అంబటి రాంబాబుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను సంక్రాంతికి సంబరాలు చేస్తాను కాబట్టే.. తనకు సంక్రాంతి సంబరాల రాంబాబు అనే పేరు వచ్చిందని తెలిపారు. తాను సంబరాల రాంబాబు అనే విషయాన్ని అంగీకరిస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.
సంక్రాంతి వేడుకల్లో మరోసారి డాన్స్ అదరగొట్టిన మాజీ మంత్రి, @YSRCParty నేత @AmbatiRambabu#Bhogi2026 pic.twitter.com/I2C5QkoI74
— greatandhra (@greatandhranews) January 14, 2026