sankranthi 2026 kodi pandalu: తెలుగు సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి వేడుక. రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందడి ప్రారంభమైంది. భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. కోస్తాంధ్రలో కోడిపందాల సందడి సైతం ప్రారంభమైంది. బరుల్లో కోళ్లు కాళ్లు దువ్వడం ప్రారంభించాయి. పోలీసుల ఆంక్షలు, కోర్టు ఆదేశాలు,.. ఇలా అన్నింటి నడుమ కోళ్ల పందాలు ప్రారంభం అయ్యాయి.. అయితే రాజకీయాలతో విభేదించుకునేవారు సైతం ఈ సంప్రదాయ ఆట విషయంలో ఒక్కటవుతున్నారు. అన్ని పార్టీల నాయకులు ఈ కోడిపందాలు నిమగ్నం అయ్యారు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ కోడిపందాలు ప్రాచీన క్రీడగా పేర్కొనవచ్చు. దశాబ్దాలుగా ఉభయగోదావరి తో పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో కోడిపందాలు జరుగుతున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఎక్కువగా కోడిపందాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగకు పది రోజులు ముందుగానే గ్రామ గ్రామాన పందెం రాయుళ్లు ఎకరాల విస్తీర్ణంలో.. లక్షల రూపాయలు ఖర్చు చేసి.. 500 నుంచి 1000 మంది వరకు కూర్చునేలా మినీ స్టేడియాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ కోడిపందాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు ఈ పందాలు కొనసాగనున్నాయి.
* ఒక్కో బరిలో లక్ష నుంచి 50 లక్షల వరకు పందెం కట్టే వెసులుబాటు ఉంటుంది. పందెం రాయుళ్లు తమ స్థాయికి తగ్గట్టు పందాలు కొడుతున్నారు. గత ఏడాది ఒకే పందెంలో కోటి రూపాయల బెట్టింగ్ జరగడం అప్పట్లో సంచలనంగా మారింది.
* దేశ నలుమూలల నుంచి ఉభయగోదావరి జిల్లాలకు సంక్రాంతి వేళ కోడిపందాలు తిలకించేందుకు భారీగా తరలివచ్చారు.
* అయితే ఒక్క బెట్టింగ్ రాయుళ్లు మాత్రమే కాదు చూసేందుకు వచ్చేవారు సైతం పదివేల నుంచి 50 వేల రూపాయల వరకు బెట్టింగ్ కడుతుంటారు.
* కోస్తాంధ్ర ప్రాంతంలో ఎటువైపు చూడు జనమే కనిపిస్తున్నారు. వాహనాల రద్దీ సైతం అధికంగా ఉంది. మూడు రోజులపాటు ఇదే రద్దీ కొనసాగనుంది..
* మరోవైపు గోదావరి మర్యాదలకు అన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా అల్లుళ్లకు సంబంధించిన అతిధి మర్యాదలు ప్రారంభం అయ్యాయి.
* కేవలం గోదావరిలో సంక్రాంతి వేడుకలు తిలకించేందుకు ప్రత్యేకంగా వేలాది మంది రావడం విశేషం.