Fixed Deposit: ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ.. ఎలా అంటే?

Fixed Deposit: ప్రస్తుత కాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ వడ్డీని పొందే అవకాశం లేదు. బ్యాంకులలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎఫ్‌డీ చేస్తే ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉన్నా బ్యాంకులలో కంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం ఉంటుంది. తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ […]

Written By: Navya, Updated On : December 2, 2021 6:06 pm
Follow us on

Fixed Deposit: ప్రస్తుత కాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ వడ్డీని పొందే అవకాశం లేదు. బ్యాంకులలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎఫ్‌డీ చేస్తే ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉన్నా బ్యాంకులలో కంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఏకంగా 8.77 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇందులో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు మూడు విధాలుగా డబ్బులను తిరిగి పొందవచ్చు. వడ్డీని ప్రతి నెల, మూడు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పొందే అవకాశం ఉంటుంది.

Also Read: కెప్టెన్సీగా కోహ్లీ భవితవ్యం తేలేది ఎప్పుడంటే?

నెలవారీ ఆప్షన్ ఎంచుకున్న వాళ్లకు, మూడు నెలల ఆప్షన్ ఎంచుకున్న వాళ్లకు 7.5 శాతం నుంచి 8.5 శాతం వడ్డీరేటు లభిస్తుంది. వార్షిక వడ్డీ రేటును ఎంచుకుంటే మాత్రం 7.5 శాతం నుంచి 8.77 శాతం వరకు వడ్డీని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు ఇలా కాల పరిమితిలో డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.

సాధారణంగా ఎస్బీఐ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 2.75 శాతం మాత్రమే వడ్డీ లభించనుంది. బ్యాంక్స్ తో పోలిస్తే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు సొంతమవుతాయి.

Also Read: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే అవకాశం?