https://oktelugu.com/

Hero: పవర్, స్టైల్ అన్నీ ఒకే చోట! కొత్త హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది!

Hero హీరో మోటోకార్ప్ గత మూడు నెలల్లో కరిజ్మా XMR 210 ఒక్క యూనిట్‌ కూడా అమ్ముడుపోలేదు. జనవరి 2025లో కంపెనీ కరిజ్మా XMR 210 కాంబాట్ ఎడిషన్ వేరియంట్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

Written By: , Updated On : April 4, 2025 / 07:00 AM IST
Hero

Hero

Follow us on

Hero : హీరో మోటోకార్ప్ ఇటీవల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Xtreme 250R, XPulse 210 మోడళ్లను విడుదల చేసింది. తాజాగా కంపెనీ కరిజ్మా XMR 250ని కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. EICMA 2024లో మొదటిసారిగా ప్రదర్శించినప్పటి నుంచి హీరో కరిజ్మా XMR 250 కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే కొద్ది నెలల్లో ఈ స్పోర్ట్స్ బైక్ విడుదలయ్యే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ గత మూడు నెలల్లో కరిజ్మా XMR 210 ఒక్క యూనిట్‌ కూడా అమ్ముడుపోలేదు. జనవరి 2025లో కంపెనీ కరిజ్మా XMR 210 కాంబాట్ ఎడిషన్ వేరియంట్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. హీరో XMR 250 విడుదల కానున్న నేపథ్యంలో పాత మోడల్‌ను కంపెనీ నిలిపివేయవచ్చని భావిస్తున్నారు.

కొత్త కరిజ్మా ధర ఎంత ఉండవచ్చు?
హీరో కరిజ్మా XMR 250 ధర రూ.2,00,000 నుంచి రూ.2,20,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. విడుదలైన తర్వాత ఇది మార్కెట్‌లో ఉన్న ఇతర క్వార్టర్-లీటర్ మోటార్‌సైకిళ్లకు పోటీ ఇవ్వనుంది. సుజుకి జిక్సర్ SF 250, హుస్క్‌వర్నా విట్‌పిలెన్ 250 వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీదారుగా నిలవనుంది.

బైక్ డిజైన్ ఎలా ఉండబోతోంది?
హీరో కరిజ్మా XMR 250 కరిజ్మా XMR 210తో పోలిస్తే పూర్తిగా కొత్త డిజైన్, స్ట్రాంగ్ బాడీవర్క్‌ను కలిగి ఉంటుంది. ఇది షార్ప్ లైన్స్, మరింత అగ్రెసివ్ డిజైన్‌తో రానుంది. ముందు భాగంలో కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త సిగ్నేచర్ LED DRLలు కూడా ఉంటాయి. కరిజ్మా XMR 250 హెడ్‌ల్యాంప్ యూనిట్ కింద వింగ్‌లెట్‌లను కలిగి ఉంటుంది. సైడ్ ఫెయిరింగ్‌లో ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఇవి ఇంజన్ వేడిని రైడర్ నుంచి దూరంగా ఉంచడానికి.. మెరుగైన థర్మల్ డిసిపేషన్‌కు సహాయపడతాయి. అయితే డిజైన్, బాడీవర్క్‌లో అనేక మార్పులు ఉన్నప్పటికీ ఇది చాలా వరకు XMR 210 వలెనే ఉంటుందని భావిస్తున్నారు.

పవర్, స్పీడ్
కొత్త హీరో కరిజ్మా XMR 250 29.5 bhp శక్తిని, 25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే కొత్త 250సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్ DOHC ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్‌తో వచ్చే Xtreme 250R 3.25 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని హీరో పేర్కొంది.

బైక్ ఫీచర్లు
ఈ బైక్‌లో ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉంటుంది. ముందు USD ఫోర్క్‌లు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. కొత్త కరిజ్మా XMR 250లో స్విచ్చబుల్ డ్యూయల్-ఛానల్ ABS, TFT ఇన్‌స్ట్రుమెంట్ డాష్‌బోర్డ్, హైట్ అడ్జస్టబుల్ చేయగల క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, ల్యాప్ టైమర్, మెరుగైన ట్రాకింగ్ పర్ఫామెన్స్ కోసం డ్రాగ్ టైమర్ వంటి ఫీచర్లు ఉంటాయి. బైక్‌లో రెండు వైపులా 17-ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.