మనలో చాలామంది పిల్లలను ధనవంతులను చేయాలని భావిస్తూ ఉంటారు. అమ్మాయి లేదా అబ్బాయి పేరుపై పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఓపెన్ చేయడం ద్వారా వాళ్లను సులభంగా ధనవంతులను చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి కేవలం 500 రూపాయలతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పెంచవచ్చు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై ఏకంగా 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరం లక్షన్నర రూపాయల చొప్పున ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు మెచ్యూరిటీ కాలం తరువాత 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు సాకారం చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కనీసం 500 రూపాయలు జమ చేసినా ఈ అకౌంట్ కొనసాగుతుంది. సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు.
దీర్ఘకాలికంగా ఆర్థిక లక్ష్యాలను సాధించాలని అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఆదాయనికి అనుగుణంగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.